పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0035-1 సామంతం సంపుటం: 06-136

పల్లవి:

తొయ్యలి కొప్పున సేవంతులు నించే విట్లనె
నెయ్య మెల్ల నీకెపైనె నించరాదా

చ. 1:

చెలి శిరసు నెఱులు చిక్కు వుచ్చే విట్లునె
బలుపుంజిత్తము చిక్కు వాప రాదా
కులుకుచుం దరుణి చెక్కులు నొక్కి తిట్లనె
నులిచి నీవే యాస నొక్కరాదా?

చ. 2:

సుదతికి నొసలం గస్తూరి మెత్తే విట్లనె
మృదువుమైఁ జలు విట్లే మెత్తరాదా
కుదురుగుబ్బలమీద గోర నంటే విట్లనె
అదనంగౌఁగిట నిట్టేయంటరాదా?

చ. 3;

పడఁతిపై నొరపుగం బవళించే విట్లనె
ఒడలిపై నాకెనిట్లే యుంచరాదా
తడసి వేంకటరాయ తమకించే విట్లనె
కడు దీని ప్రేమ మిట్టే కానరాదా?