పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-3 శంకరాభరణం సంపుటం: 06-132

పల్లవి:

నేర్చితి నీవును నెయ్యము లూఁని
తేర్చినతేటలు తెలియవుగా

చ. 1:

చదివితి నీవును సాందీపు(ప)నితో
వెదకే వెదకమును వేదములు
పెదవులు గదలియుం గదలని
మదనుని చదువులు నాఁడవి చదువవుగా

చ. 2:

కరచితి నీవును కౌశికమునిచే
నెఱి నాయుధముల నేరుపులు
గుఱుతులు సోకిన గుబ్బున సొరిగెటి
వొఱపులకై దువు లొల్లవుగా

చ. 3:

తడిసితి నీవును దగుజలనిధిలో
నడరుచు మీనమ వై నాఁడు
కడుఁజెమటల వేంకటపతి నారతిం
దడసినట్ల మును దడియవుగా