పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-2 భైరవి సంపుటం: 06-131

పల్లవి:

అంత నంతం దమకాన నలసేవు మా
వింతగాని పొందు నీకు వ్రేఁగాయఁగా

చ. 1:

చాయలకే మ్రొక్కేవు సన్నలకే చిక్కేవు
మాయిల్లు నీకింత మఱపాయఁగా
పోయినరాతిరి నిన్నుం బోకు మంటాఁ బలుమారు
చేయివట్టి పెనంగుట చేఁ దాయంగా

చ. 2:

మచ్చరాన మలసేవు మాటలనే సొలసేవు
వెచ్చందనమే నీకు వ్రేఁగాయంగా
వచ్చివచ్చి నిలిచేవు వాడికలు సేసేవు
తచ్చన ప్రేమము నీకుం దగవాయంగా

చ. 3:

మంచి విడె మిచ్చేవు మనసెల్లాఁ దచ్చేవు
వంచనలే కిట్టయినా వచ్చేవుగా
ఎంచరాని తిరువేంకటేశ నన్నుం గూడితివి
పొంచి పొంచి కానికగాఁ బొందితివిగా