పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-3 భూపాళం సంపుటం: 06-126

పల్లవి:

సుదతితో నిం తేలని చూపి చెప్పరమ్మా
ఎదురెదురే చూచీ నెటువంటివలపో

చ. 1:

చెక్కుమీది చెయ్యి దీయఁ జెప్పరమ్మా దీని,
చిక్కనిగుబ్బలు మూయఁ జెప్పరమ్మా!
చిక్కునెఱులు ముడువఁ జెప్పరమ్మా దేహ
మెక్కడో త నెఱుఁగదు యెటువంటి వలపో

చ. 2:

చిత్త మేమిటికి వేఁచీఁ జెప్పరమ్మా యీ
చిత్తజుచే నేల నొచ్చీఁ జెప్పరమ్మా!
చిత్తణివిద్యలు మానఁ జెప్పరమ్మా శిర
సెత్తి యెవ్వరిని జూడఁ డెటువంటివలపో

చ. 3:

చిదుగాయ సిగ్గు లెల్లాఁ జెప్పరమ్మా వొళ్లు
చిదిమి నా నెఱుంగదు చెప్పరమ్మా
చెదరెడిఁ దమకము చెప్పరమ్మా యిప్పు
డిదె వేంకటేశుఁ గూడె నెటువంటివలపో