పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-2 ఆహిరి సంపుటం: 06-125

పల్లవి:

ఇందవయ్య మీసొ మ్ము లేల మాకు
క్రిందుపడి యెవ్వతె యెంగిలి నేల నన్నదో

చ. 1:

చెట్ట వట్టి తియ్యంగానే చేయి దీసుకొనేవు
ఒట్టు వెట్టుకొని నన్ను నొల్లనంటాను
రట్టుగ నాముద్దుటుంగరము నీచేఁ జిక్కె నిదే
పెట్టుకో యెవ్వతెవ్రేలం బెట్టి వేసారినదో

చ. 2:

పాదమువట్టుకొనంగానే పలుకవైతివి నాతో
ఆదరించంబడేనంటా అలుకతోడ
పేదవారము మాకాల పెండెముచిక్కెనిదె వో
ఏదెస నెవ్వతెకాలిదెరవుదెచ్చినదో

చ. 3:

కోపగించుకొన్న నాకుం గొమ్మనుచుం గంటమాల
మేపెటితీపులచేత మెడంబెట్టేవు
ఏపలరఁదిరువేంకటేశ నాతోనిటువలె
నీపనికింత సేసితి వింక నేమిసేతువో