పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0033-4 ఆహిరి సంపుటం: 06-127

పల్లవి:

లంపుగుబ్బ గొల్లెతల లంజకాఁడ నీ
యింపులే వెదకంబట్టీ నెట్లరా వోరి!

చ. 1:

చెప్పరాని వేడుకల సిగ్గులనే నిన్నాళ్లు
ఉప్పతిల్లుం గోరికల నుంటిం గాని
ఇప్పు డింతనిలువలే నేమిసేతు నీచిత్త
మెప్పుడు గాని రాదో యెట్లరా వోరి

చ. 2:

చిల్లర సింగారాలు చెలులు సేయఁగ నేను
వొల్లనని యిన్నాళ్లు నుంటిం గాని
మల్లెపూవు వంటినన్ను మాసిన చీర తోడ
నిల్లు వెళ్లకుండఁ జేసి తెట్లరా వోరి!

చ. 3:

కమ్మ నిపానుపున నీ కౌఁగిటలో నిన్నాళ్లు
ఉమ్మగింపుమేనితో నుంటిం గాని
దిమ్మరిసేఁతలతోడి తిరువేంకటేశ! నీ
యెమ్మె లింకా మానలే వెట్లరా వోరి