పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-7 శ్రీరాగం సంపుటం: 06-123

పల్లవి:

కౌఁగిట నిన్నుం గలయం గలవాఁడు విరహాన
వేఁగక యెట్లానుండు వినవే తరుణి

చ. 1:

చిత్తజానలముచేతఁ జిట్లె గందపుఁబూత
మెత్తని తనువుమిఁద మెఱయంగా
ఒత్తిలి యొకతెమింద నొరగి పలుకవు నీ
చిత్త మిప్పు డెందువోయెఁ జెప్పవే తరుణి!

చ. 2:

తొంగలి రెప్పలలోని తొలుకరి మెఱుఁగులు
చెంగలించి నలువంకఁ జెదరంగాను
బంగారు పతిమవంటి పడఁతి నీమైఁదీఁగ
ముంగిట వేయక యిట్టె ముయ్యవే తరుణి

చ. 3:

వీడినది మొలనూలు విరులు చెదరెం గొంత
వాడినది కెమ్మోవి వన్నెలై
కూడితివి చెలి నీవు కోనేటిరాయనిపొందు
ఈడఁ గొత్తలాయ నేఁటికే వోతరుణి!