పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-6 శ్రీరాగం సంపుటం: 06-122

పల్లవి:

పాయపు మీ మీ ఫలమూ, యీ
కాయపు సుఖములు గైకొనవద్దా

చ. 1:

చింతమోముతోడఁ జెక్కునం జేతితో
నెంతైనం బొదల విదే మమ్మా
అంతటి రమణుం డబ్బె ననుచు నీ
చెంతనే కౌఁగిటం జేకొనవద్దా!

చ. 2:

విసుగుమోముతో వెరగులాగుతో
నిసుమంత నవ్వ వేమమ్మా!
కసరేమి లేక కౌఁగిట నీవిట్టే
ఒసపరిరీతి నుండంగ వద్దా

చ. 3:

అరవిరిరీతి నబ్బురపుమేన
నెరవై వుండే విదేమమ్మా!
తిరువేంకటేశుం దెగఁగొంటివిట్టే
ఉరముపై దిగ కుండంగవద్దా