పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-4 శంకరాభరణం సంపుటం: 06-120

పల్లవి:

తమ్మిం దమ్మిం దాఁకె తపియించంగా
అమ్ములే యమ్ములఁ దాఁకె నంతలోననె

చ. 1:

చందురుం జందురు నేఁచె జాలికి జాలివుట్టె
మందమారుతము సోఁకె మందమాయే గాలి
తీఁగె సోఁకి తీఁగ వాడె తేనె దాఁకి తేనె చిందె
చేఁగ చిగురునం గాఁగె చెంగావి చిగురు

చ. 2:

వేంకటేశ్వరునిమిఁద వేంకటేశ్వరుండు వచ్చె
సంకె మీదసంకె దేరె సకియభాగ్యమే