పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0032-1 రామక్రియ సంపుటం: 06-117

పల్లవి:

తానే చూడవే యీతండు నన్ను
పోనీ పోనీ పోనీ ననీనే

చ. 1:

చల్ల లమ్మనీఁడే సారెకు నాపైఁ
జల్లీఁ జల్లి చక్కందనమే
నల్లని జాణుండు వీఁడే నే
నొల్ల నొల్ల నొల్ల నోయమ్మా!

చ. 2:

పువ్వుల నిప్పుడు వేసేని నాతో
నవ్వి నవ్వి నక్కుం జూపుల
దవ్వుల నీతండు చూడవే నే
నవ్వా నవ్వా నవ్వా నోయమ్మా!

చ. 3:

ఇంకా నలమీ నీతండు నాతోఁ
గొంకీ కొంకి కోరికల
వేంకటేశుం డరవిరియై నేఁ
బొంకా బొంకా బొంకా నోయమ్మా!