పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-2 ముఖారి సంపుటం: 06-116

పల్లవి:

పట్ట రైరిగా మిమ్ముఁ బడఁతులు వద్దనుండి
ఒట్టిచే ముట్టి సరసా లొద్దంటిఁగా

చ. 1:

పువ్వులచెండున వేసి పప్పొడి వాటులం బడి
నొవ్విఁ బడే వేలే కన్నులఁ దిట్టు తా
అవ్వలివ్వలివెములై అలిగితి రిద్దఱు
నవ్విన నవ్వి జగడాలు నడుమనే వచ్చెఁగా

చ. 2:

చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి
పలచని చల్ల నీకు బాఁతిగాదురా
కలఁచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు

చ. 3:

అమ్మకునే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి
క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు
సొమ్మెలం బోయే వేలె సొంపుగొల్లెతా వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నీకును