పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0061-1 మలహరి సంపుటం: 06-115

పల్లవి:

ఆయలేరే యేమి చెప్పి రాతనిసుద్దులు నాకూ
తాయిమక్కళాలె కాక దయగద్ధా తనకు

చ. 1:

కన్నులఁ జూడనె పట్టె కాఁకలు సేయనె పట్టె
ఇన్నిటా తా నన్ను గూడే దెప్పుడో కాని
సన్నలు సేయనే పట్టె చవులు చూపనే పట్టె
వెన్నెలబాయిటికి రా వేళ లేదు తనకు

చ. 2:

నవ్వులు నవ్వనే పట్టె నాలిసేయనే పట్టె
ఇవ్వల నన్నుం గూడేది యెన్నఁడే తాను
పువ్వుల వేయనే పట్టె బుజ్జగించనే పట్టె
పవ్వళించం బ్రొద్దులేదు పను లేలే తనకు

చ. 3:

మాటలాడనే పట్టె మనసు చూడనే పట్టె
ఈటునం గాలు దొక్కేది యెన్నఁడే తాను
పాటించి శ్రీ వెంకటాదిపతి నన్ను నురముపై
తేటలుగా నెక్కించుక దించ నెడలేదు