పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-5 శ్రీరాగం సంపుటం: 06-113

పల్లవి:

జాణతనా లాడే వేలే జంపు గొల్లెతా వోరి
ఆణిముత్యముల చల్ల లవి నీకుఁ గొల్లలా

చ. 1:

పోయవే కొసరుఁజల్ల బొంకుగొల్లెతా, వోరి
మాయింటి చల్లేల నీకు మనసయ్యిరా
మూయకువే చల్ల చాడిముచ్చు గొల్లెతా వోరి
పోయవొ పోవొ మాచల్ల పులు సేల నీకును

చ. 2:

చిలుకవే గోరం జల్ల జిడ్డుగొల్లెతా వోరి
పలచని చల్ల నీకు బాఁతిగాదురా
కలఁచవే లోనిచల్ల గబ్బిగొల్లెతా వోరి
తొలరా మా చల్లేల దొరవైతి నీకు

చ. 3:

అమ్మకువే చల్లలు వొయ్యారిగొల్లెతా వోరి
క్రమ్మర మాతోడ నిట్టే గయ్యాళించేవు
సొమ్మెలం బోయే వేలె సొంపుగొళ్లెతా వోరి
దిమ్మరి కోనేటిరాయ తిరమైతి నికును