పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-4 శంకరాభరణం సంపుటం: 06-112

పల్లవి:

ఓయమ్మ వెరపించె నొకభూతమూ
రోయక యిన్నిటనుం దిరుగు భూతమూ

చ. 1:

పది శిరసుల పెద్ద బమ్మ రాకాసునిని
జెదరనీక యడిచిన భూతమూ
మదమున బాలెంత మగువ నెత్తురు పిన్న
పెదవిఁ బీలిచెఁ బెను భూతమూ

చ. 2:

వేయి చేతుల పెద్ద వెడగు దానవునిఁ
జేయి చాఁచి యడిచిన భూతమూ
రాయడింపుచు బెద్దదంటరక్కసుని
బాయం జీరిన బలు భూతమూ

చ. 3:

పడుచుఁ బట్టుక వేఁచే పసిఁడిదైత్యునిని
కడుపు చించిన ఘన భూతమూ
అడరి శ్రీ తిరువేంకటాద్రి మీఁద నుండి
పొడచూపె నదివో పెంపుడు భూతమూ