పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-3 నాదనామక్రియ సంపుటం: 06-111

పల్లవి:

చెల్లెఁగా నీవు సేసినచేఁతలు నీవు
వొల్లకే విభునింతవొడలు వేఁచితివి

చ. 1:

పొడపుఁ జందురుఁడు నొప్పులు సేయువిరహులను
పెడమొకముచేసి నొప్పించేవు
కడుఁ బలికి కీరములు కారించు విరహులను
పడతి పగఁబెట్టితివి పలుకకే విభుని

చ. 2:

తొలుమెఱుపు మెఱిచి పాంథుల నొంచు నీ వెదుట
పొలయకే నొంచితివి పొలిఁతి యతని
బలుపువెన్నెల భంగపఱచు విరహుల నింత
నలఁగించితివి నీవు నవ్వకే విభుని

చ. 3:

పన్నీరు విరహులను బరవశముసేయు నీ
మన్ననఁ గౌఁగిటఁ జేర్చి మరపించితి
కన్నియరో నీవు వేంకటవిభుని కౌఁగిటను
ఇన్నిటను గడుమించి తేమి చెప్పెడిదే