పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-2 సామంతం సంపుటం: 06-110

పల్లవి:

వింత వింత వింతలూ, నీ
చింతలే పో చిగిరింతలూ,

చ. 1:

పోపో పోపో విడవోయీ నీ
చూపు మాపై జూఁడించకా,
రేపే పో రేసులెల్లా నీ
తీపేపో తీదీపులూ,

చ. 2:

చాలుఁ జూలుఁ జాలుఁ బోవోయీ, నీ
జాలి మాపై జల్లించకా
రేలేపో రిచ్చలెల్లా నీ
మేలే మేలే పో మెరమెరలూ

చ. 3:

రాఁపు రాఁపు రాఁపు లేలోయీ నీవు
మాపుదాఁకా మాతోడనే
యేఁపకు వేంకటేశ నన్ను నీ
కాపురమే పో కరఁగింతలూ