పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0060-1 పాడి సంపుటం: 06-109

పల్లవి:

పిల్లఁ గ్రోవి పట్టుమంటాఁ బెరరేఁచీని మా
గొల్లవారి పిల్లఁగోవి కోరో చల్లా

చ. 1:

పాడుమంటా దండెమీఁటెఁ బలుమారునుం దా
వేడుక నెవ్వతెపాట వినవచ్చెనో
వాడలోఁ జల్లలమ్మే వనిత నింతే శ్రుతి
గూడి నేఁ బాడేటిచల్ల కోరో చల్లా

చ. 2:

చేరి నన్ను నాడుమంటాఁ జెక్కు నొక్కీని తా
గారవాన నెవ్వతాట గనివచ్చెనో
మారుకు మారాడేటి మందవారము మేము
కోరికి నాడేటి చల్ల కోరో చల్లా

చ. 3:

కిన్నెర మీటుమంటాఁ గెలసీని తన్నుఁ
గిన్నెర మీట్ల నేది గిలిగెంచెనో
కన్నుల కలికి వేంకటపతిపై వెట్టి
గొన్న కిన్నెరగుబ్బల కోరో చల్లా