పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-6 మలహరి సంపుటం: 06-108

పల్లవి:

మొల్లలేలె నాకు తన్నె ముడుచు కొమ్మనవె నేఁ
జెల్ల పూవు కొప్పుతావి చెంచుదానను

చ. 1:

పట్టుచీరేఁటికి నాకు పారిటాకులె చాలు
దట్టిగట్టుకొమ్మనవే తనమొలనే
పట్టెమంచ మేలె నాకు పవ్వళించు మనవె నేఁ
జెట్టుకిందఁ బొరలాడే చెంచుదానను

చ. 2:

సందిదండ లేలె నాకు సంకుఁగడియమె చాలు
యిందవే యెవ్వతెకైన నిమ్మనవె
గందమేలె నాకు చక్కని తనకే కాక నేఁ
జిందువందు చెమట మై చెంచుదానను

చ. 3:

కుచ్చుముత్యా లేలె నాకు గురివిందలె చాలు
కుచ్చి తనమెడఁ గట్టి కొమ్మనవె
కచ్చుపెట్టి కూడె వేంకటగిరీంద్రుఁడు నను
చిచ్చినే నడవిలో చెంచుదాననూ