పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-5 శంకరాభరణం సంపుటం: 06-107

పల్లవి:

సిగ్గున నీవలె నేఁ జెప్పుకొనఁ గాకా
దగ్గఱి నాదేహ మంటి దాననైన నమ్మేవా

చ. 1:

పాయ లేక నన్నుఁ బాసి పట్లువెట్టు కొంటినంటా
మాయలుసేసే వదేర మాఁటిమాఁటికి
యీయెడ నేఁ బుట్టుతొ నీయెదుటనె నిలుచున్న
చాయలమాట లనక చాల నీవు నమ్మేవా

చ. 2:

పట్టలేక నన్నుఁ బాసి ప్రాణ మింతా బరవంటా
వొట్టుక నామీఁద నీవు వొలవేసేవు
గుట్టున నేవూరుపులు గుమ్మరించ నెఱుంగక
పట్టిన నాప్రాణ మిదె పైపై నున్నదిరా

చ. 3:

ఇప్పుడు ననుఁ బాసి యిదె మేను చొక్కెనంటా
వొప్పుగ నామీఁదఁదెచ్చి వొళ్లువేసేవు
కప్పరా పచ్చడము వేంకటగిరీంద్రుఁడ నాకు
నప్పుడె నీకంటెను లోనైతి నిదె చాలదా