పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-3 సామంతం సంపుటం: 06-105

పల్లవి:

మాట లాడనేరని రమణిఁబో నేను, నా
మాటలెల్లఁ బైఁడి వంటి మాటలే గదె

చ. 1:

పచ్చగందని పడుచఁ బడఁతి నేను, నేఁ
డచ్చి వేసినట్టి వనితనె కదవె
లచ్చిగొండి నీవంటినెలఁతనా నేను, యింత
పెచ్చువెరిగే వదేమె పిన్నదానవా

చ. 2:

మిగులదళము గలమేఁటిఁబో నేను, నీ
దగునింటి ముంగిటి నిధానమంగదే
జగడాలగంప దింపుసతినా నేను, యింత
చిగురుఁగొమ్మ వదేమె చిన్నదానవా

చ. 3:

తలపూ వాడని తరుణినే నేను, నే
నలరుఁజవికలోనియాకెనే కదే
కలికి వేంకటపతి కాంతనేనూ నేఁ
దొలియింతి నాకంటె దొడ్డదానవా