పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0059-1 సామంతం సంపుటం: 06-103

పల్లవి:

భ్రమయించే విట్టే పదిమారులు
నిమిష మేఁడాయె నీ చేత నాకు

చ. 1:

పాఁతమడుగుగడ్డఁ బడి యీఁతకాఁడవు
లోఁతు చొరకురా లోఁగేవు
మూఁతులే గిరువంగ మోము నొచ్చీనంత
బాఁతి మీఱఁ బకపక నవ్వకురా

చ. 2:

అలవిగాని మోహపు టాసకాఁడ నీ
వలుగకురా వెఱపయ్యీని
అలరి నీటఁ గొండలైనఁ దేలించేవు
లలనపైనె నీలా వింత వలెనా

చ. 3:

రచ్చరావికింద రంతులె చేసేవు
బచ్చనమాటల వసకాఁడ
రచ్చ చేసే వింక రాతి గుండె తోడ
వెచ్చపు సొలపుల వేంకట విభుఁడా