పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4


నీతివిచక్షణుల్ నీతిశాస్త్రం బని
                      కవివృషభులు మహాకావ్య మనియు
లాక్షణికులు సర్వలక్ష్యసంగ్రహ మని
                      యైతిహాసికు లితిహాస మనియుఁ
బరమపౌరాణికుల్ బహుపురాణసముచ్చ
                      యం బనియును గొనియాడుచుండ


ఆ. వె.

వివిధవేదతత్త్వవేది వేదవ్యాసుఁ
డాదిముని పరాశరాత్మజుండు
విష్ణుసన్నిభుండు విశ్వజనీనమై
పరగుచుండఁ జేసె భారతంబు.

(ఆది 1-31)

చెప్పినట్లుగా సోమనాథుఁ డీకృతిలో నిట్లు చెప్పియున్నాఁడు.

సీ.

వైదికు లిది శుద్ధవైదికం బని యెన్న
                      శాస్త్రజ్ఞు లిది ధర్మశాస్త్ర మనఁగఁ
దార్కికు లిది మహాతర్కం బనంగఁ బౌ
                      రాణికు లిదియె పురాణ మనఁగ
నాగమవిదులు దివ్యాగమం బిది యనఁ
                      దంత్రజ్ఞులు లిది వీరతంత్ర మనఁగఁ
భక్తవారం బిది భక్తి మార్గం బన
                      ముక్త్యర్థు లిది మహాముక్తిద మన


ఆ. వె.

కవులు భువిని నిదియె కావ్యం బనంగ స
జ్జనుల కెల్ల మిగుల సంతసముగ
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యముల్ రచింతు బసవలింగ!

(22 పద్యము)

పండితారాధ్యచరిత్రరచనమునాఁటికి సోమనాథుఁడు చతుర్వేదపారగుఁడు. కావుననే యీ గ్రంథము రచించు నధికారము గలిగియున్నాఁడు.