పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

సోమనాథునికి ముందు వెలసిన ప్రసిద్ధశైవాచార్యుఁడు హరదత్తాచార్యుఁడు రచించిన చతుర్వేదతాత్పర్యదీపిక దీనికి మార్గదర్శకము కానోపును.

ఇందులోని సీసము లన్నియు సమతావిలసితము లయి సోమనాథుని కవితావైశద్యమును బ్రకటించుచుండును. భక్తాగ్రేసరుఁ డగు బమ్మెర పోతరాజు "మందారమకరంద" అను పద్యమునకు నిందులోని పద్యమే మూలము. ఆ రెండింటి నీదిగువ నిచ్చుచున్నాఁడను,

సీ.

రాకామలజ్యోత్స్నఁ ద్రావ నిచ్చలు గన్న
                      నాచకోరంబుల కరుచి యగునె
సహకారపల్లవచయములు దొరకిన
                      జాతికోయిలలకుఁ జప్ప నగునె
క్షీరాబ్ధిలోపలఁ గ్రీడింపఁగల్గిన
                      భువి రాజహంసకుఁ బుల్ల నగునె
విరిదమ్మివాసనవెల్లి ముంచినఁ గ్రోలు
                      షట్పదముల కనాస్వాద్య మగునె


ఆ.

బహుళతరదయార్ద్రభావప్రభావన
మహిమఁ దనరు జంగమంబు రాఁగ
నతులభక్తిపరుల కాహ్లాదకర మగుఁ
బరిహృతాభిషంగ బసవలింగ!

చతుర్వేదసారము (155 పద్యము)

సీ.

మందారమకరందమాధుర్యమునఁ దేలు
                      మధుపంబు వోవునే మదనములకు
నిర్మలమందాకినీవీచికలఁ దూఁగు
                      రాయంచ సనునె తరంగిణులకు
లలితరసాలపల్లవఖాది యై చొక్కు
                      కోయిల సేరునే కుటజములకుఁ