పుట:కాశీమజిలీకథలు -01.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

285

బ్రదుకు జోలి మీకేల? నేను ప్రభావతితోఁ జదరంగమాడ వచ్చితిని. యీ వార్త రాజుతోఁ జెప్పుడు. అంతియ మీరు చేయునది. లేనిచో శాసన మేటి కిందు వ్రాసితిరి? అని ధైర్యముగాఁ బలికిన వారు, బాబూ! మాకేమి? నీకై చెప్పితిమిగాని వేరుకాదు. నీ యిష్టము అని పలికి యా వార్త రాజునకుఁ దెలియఁజేసిరి. జయభద్రుఁడును ఆ వార్త కూఁతునకుఁ దెలియఁజేసెను.

ప్రభావతియుఁ బెక్కుదినములనుండి యెవ్వడు దనతోఁ జదరంగమాడ కుండుటచే నప్పుడు మిగుల సంతసించుచుఁ బ్రవేశపెట్టవచ్చునని క్రింది యధికారుల కాజ్ఞాపత్రికలం బంపినది. వానిం జూచుకొని యా యుద్యోగస్థులు ప్రద్యుమ్నుని నొకదాదివెంట నంతఃపురమునకు బంపిరి. అతనిం జూచినవారెల్ల కాలముమూడినవానిగాఁ దలంచుచుఁ జింతింపఁదొడంగిరి.

ఆదాది ప్రద్యుమ్నునిఁ జతురంగకేళిగృహంబునకుఁ దీసికొనిపోయి యొక పీఠంబున గూర్చుండఁబెట్టెను. ఆతం డాయింటి యలంకారమున కచ్చెరువందుచుఁ బ్రభావతి రాక కెదురుచూచుచుండెను.

ఇంతలో నొకబంగారుబల్లపై నమర్చిన గళ్ళబల్లనుఁ బల్లవపాణులు కొందరు దెచ్చి ముందుపెట్టిరి. అంత నాకాంత యశేషపురుషమోహనవేషంబుతోఁ జెలికత్తెయల చేతు లూతగాఁ బూని యచ్చోటి కరుదెంచి యతని చూపులకు మిరుమిట్లు గొలుపుచుఁ దళుక్కురని మెరయుచు నా బల్ల కవ్వలనున్న పైగద్దియం గూర్చుండి యూడిగింపుచేడియ లిరుగడ నిలిచి వింజామరలు వీవ నా ప్రద్యుమ్నునితోఁ జతురంగ మాడఁదొడంగినది.

అమ్మదవతి మొదట నతని నేమియుఁ బల్కరింపక తన వాలుదళ్కుచూపు లొకసారి యతని మొగముపైఁ బరగించినది. దానంజేసి యతని హృదయము చెదరిపోయినది. వెఱ్ఱివానివలె నొడలెఱుంగక యక్కురంగనయన సోయగం బుపలక్షించుచు నాటయం దించుకేనియు జ్ఞానముంచలేదు. మరియు నిత్తరుణీకక్షమూలకాంతి కంచుకిని జించుకొని బయల్పడఁ జేయెత్తి బలముసద్దునప్పు డతని దృష్టియంతయు, నా ప్రాంతమందే సంచరించుచుండినది. గెలుపు సంతసంబున వేగిరించి యమ్మించుఁబోఁణి బలము నవతరించునెడ రత్నపుటుంగరముల రంగునకు మెఱుఁగిడు నంగుళులు దన కరంబునకుం దగిలెనేని మేనెల్లం బులకలుబొడమ నతండంతటితోఁ దన మేను సార్ధకమైనట్లు సంతసించుచు ఈ తీరున నా ప్రద్యుమ్నుఁ డా ప్రభావతి రూపవిలాసవిభ్రమములకు వలలోఁబడి కొట్టుకొనుటం జేసి నడుమ రెండాట లోడిపోయెను.

అప్పుడతఁడు తన మోసము తెలిసికొని యౌరా! దీనితో మగవాఁడు చతురంగ మాడి గెలువలేడు. ఇది యాటయందు మిగుల పాటవము లేనిదైనను పురుషులకుఁ దనరూప మెరవైచి వశము చేసికొనుచున్నది. అన్నన్నా! విష్కారణము