పుట:కాశీమజిలీకథలు -01.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేపనవ్విన కథ

283

లేపినను గారణము చెప్పక యూరక లేవననుచున్నాడు. నీవుకూడ వచ్చి పిలువుము నీతో నేమైన మాట్లాడునేమో యనుటయు నా ప్రద్యుమ్నుఁడు వేగము దండ్రియొద్దకు వచ్చి యతని ప్రక్కలోఁ గూర్చుండి నాయనా! భోజనమునకుఁ లేవననుచున్నారఁట కారణమేమి? యేదియైన మావలనఁ దీరవలసిన కార్యమున్న జెప్పుఁడు. ప్రాణంబు లిచ్చియైనఁ జేయుదుము. ఊరకిట్లు పట్టుపట్టవచ్చునా! చిన్నవారము మేము గోపగించినప్పుడు మీరు దీర్చవలసినదికాని మిమ్ముఁ దీర్చ మే మెంతవారము లెండని ప్రార్థించిన విని మంత్రి పుత్రుని గౌఁగిటలోఁ జేర్చుకొని ప్రత్యుమ్నా! మీరందరు పిల్లవాండ్రగుటచే మీతో జెప్పలేదు. కోపగించికాదు. ఏమని చెప్పుదును? నాకాయుర్దాయ మిఁక నారుమాసము లున్నది. ఈ యవివేకపురాజు తానడిగిన ప్రశ్నము చెప్పుటకు నారు మాసములు మితియెచ్చి చెప్పలేకపోయినచో నన్నురి దీయుటయేకాక మన యాస్తి యంతయు లాగికొని మిమ్మదంబరను లేవఁగొట్టునట! ఇట్టిదారుణ మెందైనగలదా?

అన్నన్నా! చేప నవ్వుటయేమి ఆ రహస్యము చెప్పకబోయిన నన్నురిదీయుట యేమి? చేప నవ్వినకారణ మెవ్వఁడు చెప్పఁగలడు? ఈ లవంగికిఁ బెండ్లియైన జేయలేకపోయితిని. నీవు గడుపిన్నవాఁడవు. నా యనంతరము మీ రేమైపోయెదరోయని విచారించుచుంటిని. ఇట్టి విచారముతోనుండ నోటి కన్నము రుచించునా? యని పలికి పుత్రుం గౌఁగలించుకొని యేడువసాగెను. లవంగియు ప్రభుకీర్తి భార్యయు నామాట విని విచారింపఁదొడఁగిరి.

అప్పుడు ప్రద్యుమ్నుడు తండ్రి నూరడింపుచు మీ రిప్పు డూరక చింతింపకుఁడు. ఇంక నారుమాసములు మితియున్నదిగదా! దైవమింతలో మనకేదైన నుపాయము తోపింపఁడా? దైనయత్నములేక యేకార్యము జరుగదు! నేను దేశాటనముచేసి యాకారణము తెలిసికొని వచ్చెద. లోకమున బుద్ధిమంతు లుండకపోరు. కావున నాకు సెలవీయుఁడు. మీరు భోజనమునకు లెండనిపలికినఁ బుత్రునిధైర్యమునకు సంతసించి ప్రభుకీర్తి భజించెను. అప్పుడే ప్రయాణమునకు లేచి సవరించుకొనుచున్న యన్నగారినిఁ జూచి లవంగి యిట్లనియె. అన్నా! నీ వెన్నఁడును ఇల్లువిడిచి యడుమలఁబడన వాఁడవు కావు. ఒంటిగా దేశాటనము చేయలేవు. నేనుగూడ నీతో వచ్చెదను. తీసికొని పొమ్మని చెప్పిన నతం డెట్టకేల కియ్యకొనెను. వారిరువుర ప్రయాణమును విని మంత్రి విచారముతో నిట్లనియె.

అయ్యో! నా పసికూనలారా? రాజు నన్నారుమాసములపైన నుఱితీయించును. మిమ్ముఁ జూడనిచో నిప్పుడే ప్రాణములు పోఁగలవు. ఈయారుమాసములైన గన్నులకుఁ గనబడకుండ దూరముగాఁ బోయెదరా? దైవ మెట్లుచేయదలఁచిన నట్లుచేయక