పుట:కాశీమజిలీకథలు -01.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

274

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బయటనున్న చండికాదేవి యాలయంబున కరిగి తలుపులు తెరచి లోన దీపము వెలిగించి తాదెచ్చిన యుపహారములు నివేదన జేసి చేతుఁలు జోడించి యిట్లు ప్రార్థించెను.

తల్లీ ! నీవు సమస్తచరాచరప్రపంచముల కధికారిణివి. నీ కతంబున జగంబులు నిలిచియున్నవి. నీ మహిమ యవాఙ్మానసగోచరంబు. నా కోరిక ప్రకారము నా మనోహరుని రప్పించి యభీష్టము తీర్చితివి. ఇంక నీ మ్రొక్కు చెల్లించుకొనుము. ఇదిగో! నా తల నీకు బలి యిచ్చుచుంటిని. ముందు జన్మమందుగూడ నా కితండే పతి యగున ట్లనుగ్రహింపుము. నాబుద్ధి నెల్లప్పుడు పాతివ్రత్యంబుననుండ నియోగింపుము. అని వేడుకొనుచు నా దుర్గపాదంబులఁ దనతలఁ గొట్టుకొని మేను విడువ బ్రయత్నించినది.

ఆ యమ్మవా రానాతి పాతివ్రత్యమున కచ్చెరు వందుచుఁ బ్రత్యక్షమై యోహో సాధ్వీ! సాహసము మానుము. నీ సత్యమునకు మెచ్చుకొంటి. నీ కెద్దియేని కామ్యముండినఁ గోరుమని బలికిన విని యక్కలికి మై బులకింప నద్దేవికి మ్రొక్కి పెక్కుతెరంగుల స్తవము జేయుచు నమ్మా నేను నా పతి యనుమతిలేక యేదియుఁ గోరను. ఆయన మా యింట నిద్రబోవుచున్నాడు. సెలవైనచో నింటి కరిగి యడిగి వచ్చెద ననుటయు నాశక్తి యందుల కియ్యకొని గయ్యన రమ్మని పంపెను. అప్పు డాపడఁతి మబ్బునుండి వెడలు మెఱపుతీగెయుం బోలె నా యాలయమునుండి మరలి యింటికి వచ్చినది.

బుద్దిసాగరుండు గుడివాకిటఁ బ్రచ్ఛన్నముగా నిలిచి యామాట లన్నియు విని యున్న కతంబునం దనపతి గుణమునకు మిక్కిలి యానందము జెంది యా సుందరి కన్న ముందే చని యెప్పటియట్ల శయ్యయందు బండుకొని నిద్రపోవుచున్నవానివలె గుర్రు వెట్టుచుండెను.

అంత నా నెలంతయు నంతఃపురము జేరి యందు గాఢనిద్రావశంవదుఁడై యున్న పతిని లేపుటకై సంశయింపుచు నమ్మవారు తనకై వేచియున్నది. కాన నామెకుఁ గోపము వచ్చునేమో యని వెరపుతో నతనిమీఁద మెల్లగాఁ జేయివై చినది. అతడు దద్దరిల్లి లేచి కూర్చుండి యావలించి కన్నులు నులుముకొనుచు నించుఁబోఁణి నన్ను లేపితి వెందులకని యెఱుఁగని వానివలె నడిగెను.

అప్పుడా చిన్నది యతనికి మ్రొక్కి జరిగిన కథ యంతయు జెప్పి కోరఁ దగిన గామ్యము సెలవియ్యుఁడని మగని వేడుకొనెను. బుద్ధిసాగరుఁడా ముద్దియను దద్దయుఁ బ్రీతి గౌఁగలించుకొని వనితా మనకు నమ్మవారిం గోరుటకు సకలైశ్వర్యములు గలిగియున్నవి. కావున వానిం గోరక నీవు చేయివేసినంత చచ్చినవాఁడు బ్రతుకునట్లు వరమడుగుము. దాన మిగుల నుపయోగముగా నుండుననుటయు నా