పుట:కాశీమజిలీకథలు -01.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భేరుండపక్షికథ

247

దలచితికి లేవలేక నేలంబడినది. పెక్కు దెబ్బలు గొట్టినతోడనే యది చచ్చెను. ఇదియే నేను జేసినపని యని చెప్పెను. ఆరాజు చింతాక్రాంతుఁడై అయ్యో! నే నీపక్షిని సామాన్యుఁడు చంపలేడుగదా యని తలంచి యట్టివానికి నాకూఁతునిచ్చి వివాహముచేసెదనని ప్రతిజ్ఞచేసి యుంటిని. తుదకంత బలవంతమైనపక్షి యీరజకుని చేతిలో జచ్చెను. అయ్యో! నాచక్కనికూఁతురును జాచిచూచి యీచాకలి కెట్లు పెండ్లి చేయుదును? కటకటా యటువంటి ప్రతిజ్ఞ యేమిటికిఁ జేసితిని? ప్రతిజ్ఞాభంగము గావించినచో సరిరాజులందరు పరిహాసముచేయుదురు పోనీ! యీ పక్షిని వీఁడు చంపలేదేమో యనుకొన్నను చంపిన బలశాలి యెవ్వఁడు బయలుపడకున్నాడు. యిప్పు డేమిచేయుదును? యీ యాపద దొలగించువా డెవ్వఁడైన లేడేయని యనేకవిధముల సంతాపించుచు లోపల నిష్టములేకున్నను వివాహప్రయత్నము చేయుమని యాజ్ఞాపించి దానికిఁ బ్రతికూలమైన చర్యల నాలోచించుచుండెను.

రాజుగారి కుమార్తెనుఁ బక్షిని జంపినందులకుగాను చాకలివాని కిత్తురను ప్రతీతి గ్రామమంతయు వ్యాపించినది.

ఆ వార్త కుమారునిచేఁ పూటకూటి పెద్దమ్మ విని యేమేమీ! రాత్రిఁ బక్షిని చాకలి చంపెనా! యెవ్వరు చెప్పిరి? చీ ఛీ! యిన్నిదినములనుండి యాచాకలి యెచ్చటికిఁబోయెను! ఆ పక్షిని జంపినవారిని నేను చెప్పెదను. వినుండుఁ నిన్నరాత్రి మా యింటికి నిద్దరు రాజపుత్రులు వచ్చిరి. వారు వీథిలోఁ బరుండఁబోవునప్పుడు నేను పక్షిసంగతి చెప్పితిని. దానికి వారు భయపడక నిర్లక్ష్యముచే వీథిలోఁ బరుండి వారే యీ పక్షిని జంపియుందురు. వారు తెల్లవారుజామున నాకుఁ జెప్పి పోయిరి. నిద్రచే నేను బరిశీలింపకపోయితిని. వీథిలోఁ బరుండి బ్రతుకువారు మరియొకడు గలరా ? తప్పక వారే చంపిరని చెప్పగలను. అని పలికిన తల్లిమాటలు విని కుమారుఁ డత్యంతసంతోషముతో రాజుగారియొద్దకుఁ బరుగెత్తుకొనిపోయి తన తల్లి చెప్పిన వర్తమాన మంతయుం జెప్పెను.

అప్పుడారాజు మిగుల నానందమంది యా బ్రాహ్మణకుమారునకు బహుమతి నిచ్చి యా రాజకుమారుల వెదకి తీసికొని వచ్చుటకు నలుదెసలకుఁ బెక్కండ్ర దూతల పంపెను.

వారిలోఁ గొంద రా రాజపుత్రుల నొకసత్రంబునం గాంచి యానవాలుపట్టి వారితో నిట్లనిరి. అయ్యా! తమ రీమధ్యను మద్యార్జునపట్టణమునకు వచ్చి రాత్రియందు దిరుగుచున్న భేరుండపక్షిని జంపిరా! యని యడిగెను. ఆ మాటలు విని బుద్ధిసాగరుండు ఔను మేమే యా పక్షిని జంపితిమి. జంపుట నేరమా! యని పలికెను.

అప్పుడా దూతలు వారికి దండములు పెట్టి అయ్యో ! నేరము కాదు. దానిం