పుట:కాశీమజిలీకథలు -01.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

243

యట్లుండ మిమ్ముననవలసిన పనియేమున్నదని నిష్ఠురముగాఁ బలికిన విని యారాజు నామెవచనంబుల కెద్దియో మిషఁ బన్ని తగినట్లుత్తరములు చెప్పెను.

చిరకాలసందర్శనసంభ్రమంబున నతం డత్తలోదరితోఁ గూడి యిష్టాగోష్టి మాటలాడుచు వేడుకతోనుండెను. ఆమె చిత్తము పూర్వమువలె ననురాగయుత్తమై యుండలేదు. దాని కతం డంతరంగమున శంకించుకొనియు నప్ పుడేమియుఁ బ్రశ్న చేయలేదు. తర్వాత నా నాతిచే నమర్చఁబడిన పదార్ధములు భుజించి యమ్మించుఁబోఁణితోఁ బంచశరక్రీడలఁ దేలెను.

అట్లు కొన్నిదినములున్న వెనుక నతండా చిన్నదాని సంభోగసంభాషణక్రీడావిశేషంబులు బూర్వముకన్న నెక్కుడు వైపరీత్యముగా నుండుటఁ జింతించి యొక్క నాడామెతో నిట్లనియె.

నాతీ! నీతీరుచూడఁ బూర్వమునకు మిగుల వైషమ్యముగా నున్నది. నాయందు మక్కువతగ్గెనా? లేక యెద్దియేని కారణమున్నదియా! యెప్పుడును విచారముఖముతో నుందువేమి? ఇదియునుఁగాక నీకును నాకును నిన్నిదినములనుండి స్నేహమున్నను నీయుదంతమే నాకుఁ దెలిసినదికాదు. నీమగండెవ్వఁడు? తల్లిదండ్రు లెవ్వరు? ఒంటిగా నీయడవిలో నుండుటకుఁ గారణమేమియో! తెలియజేయుమని యడిగిన నచ్చేడియ సంతసించుచు నతని కిట్లనియె.

నాధా ! ఈ విషయ మన్యోన్యము దెలియఁదగినదే ముందు మీవృత్తాంతము జెప్పుఁడు. మీకు భార్యలెందరు? సంతాన ముస్నదా ! భార్యలయం దిష్టముగా నుందురా? అని యడిగిన నతండిట్లనియె.

తన్వీ ! నాకు భార్యిలిద్దరు గలరు. పెద్దదానిఁ దలఁపనవసరము లేదు. రెండవ దానిపేరు దేవయాన. దానికి నాయందు మక్కుప యెక్కువగనే యుస్నదిగాని యంత చక్కనిది కాదు. నాకింకను సంతానము గలుగలేదు. ఎందరైనను నీకుసాటివత్తురా యని పలికిన నక్కలికి మరల నిట్లనియె.

దేవా! మీపెద్దభార్య విషయము దలప నవసరము లేదంటిరి. ఆమె యేమి తప్పుజేసినది? కారణమేమియో తెలుపుఁడని యడిగెను. అప్పు డతండు కొంతసేపు ఇతర ప్రసంగములతో నాసంగతి గప్పఁదలంచెను. గాని యమ్మానిని మరియేమియు వినిపించుకొనక యా ప్రశ్నయే పలుమారు చేయఁదొడంగెను. దానంజేసి తుద కతనికి జెప్పక తీరినదికాదు.

బోఁటీ! యాపాటలగంధిపేరు సుశీల. దానితండ్రి కపటముగాఁ బటము వ్రాయించి నాయొద్దకంపెను. నేను బటములోనున్నప్రకార మాసుశీల యందముగా నున్నదనుకొని దాని బెండ్లి యాడితిని. అది మాయింటికి రాకమున్ను దానికిఁ జదువుఁజెప్పిన గురువు నాయొద్దకు వచ్చి దానికి మూర్ఛరోగమున్న దనియుఁ బటఁ