పుట:కాశీమజిలీకథలు -01.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

239

సుశీల పరిచారికలు దెచ్చిన విడియపు చుట్టలు తనకందించుచున్న దీర్ఘదర్శికి రాజిట్లనియె. ఆర్యా! మనము భుజించునప్పుడు నీకుబోధకాని చర్యలుకొన్ని ప్రవర్తిల్లినవి. ప్రాణతుల్యుఁడవగు నీకెఱింగింపకదీరదు. తలచుకొనినంత నా స్వాంతమున వింతయగు సంతసము జనించుచున్నది. అమ్మగువ చిఱునగవు మొగమున నగయై మెలుయ దట్టమగు చూపులు నాపై బరగించి నాచిత్త ముత్తలమందించినది.

మిత్రమా! నీవూరక తలవాల్చికొని భుజించితివికాని, యేమియు నెఱుంగవు. మోహినీదేవతయుంబోలె నున్న యాచిన్నదాని చిన్నె లేమని వక్కాణింతు. నేను మరలఁ జూచునప్పుడు తనచూపు! వేరొకలాగున మార్చుచుఁ దలవాల్చుకొని భుజించు తఱి తన వాలుచూపు తళుక్కులు నాపై నెరయఁజేసినది. పెక్కేల? అక్కలికికి నా యందు మక్కువకలిగినది. ఇదియ నిక్కవంబు. వేరొక్కటికాదు. నేనక్కడకు మరల నరుగవలయు. నొక్కమిశచెప్పుము. అయ్యో! ఇంక కొంతసేపచ్చట నిలువ నీయక యిచ్చటికిఁ దీసికొనివచ్చితివేటికి? వచ్చుట నేనెఱుఁగను సుమీ! నేను విరాళి సైపనోప నాలోపల పురుషు లెవ్వరులేరు. మరల నచటికరిగెద నేమిచేసినను మంచిదే. దీనికి నీవేమి చెప్పదవనుటయుఁ దనప్రయత్నము కొనసాగుచున్నదని సంతసించుచు మంత్రి రాజున కిట్లనియె.

దేవా! దేవరవారి సౌందర్యముజూచినంత యొకమనుష్యకాంత కామించుట యేమి యాశ్చర్యము! దేవతావనితలైనను విరాళిం గుందుచుందురని చెప్పఁగలను. ఈమె సుశీలయైనను నీరూపుఁజూచియే మోహించినది. ఇప్పుడు పరివారికలందరు తమతమ స్థానంబులకుఁబోయిరి. ఆమె యొంటిగానే యుండును. దాహము నెపంబునఁ గ్రమ్మర నచ్చటికరిగి యత్తరుణి చిత్తవృత్తి గనిపెట్టి పైనఁ నాలోచితముగా నడిపింపుఁడు. నేను వెనుకఁ గాచియుండెదనని పలికిన సంతసించి యారాజు మెల్లన లేచి యంతకు పూర్వమే పరిచారికలందరు తమతమ నెలవుల నడఁగి యుండిరిగాన నిశ్శబ్దముగా నున్న యాలోగిటలో నాలుగుమూలలు తొంగితొంగి చూచుచు మరల భోజనశాల కరిగెను.

అంతకుమున్నే యాకాంతయు మంత్రిచే బోధింపఁబడి యున్నది. నిదురింపక నావంటశాలయందే తిరుగుచుండెను. ఇంతలో నారాజా లోనికింజని యవ్వనితం జూచి గద్గతస్వరములో మించుఁబోఁడీ! కొంచెము దాహ మిచ్చెదవాయని యడిగెను.

అప్పు డప్పఁడతి యడుగులు తడఁబడ యొయ్యారముగా నిలఁబడి లేనవ్వుతో