పుట:కాశీమజిలీకథలు -01.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రాజు తదీయవైభవంబునకు నాదరణంబునకుఁ బెక్కు తెరంగుల సంతసించుచుఁ దన యానందమంతయు మంత్రితోఁ జెప్పుచుండెను.

శ్లో॥ యదైవోపహతం దుఃఖం సుఖం తద్ధిర పాంతరం
      నిర్వాణాయతరుచ్ఛాయా తప్తస్యహివిశేషతః॥

దు:ఖము పూర్వముగాగల సౌఖ్యమే హాయిచేయును. ఎండచేఁ దపింపబడిన వానికేగదా చెట్టునీడ విశేషసుఖరరముగా నుండును. అలాగుననే యడవిలో గాలివానచే మిగుల నలసటజెందిన యారాజునకు సుశీలచేసిన యుపచారము మిగుల నానందకరముగా నుండెను.

అంత కొంతసేపున కాకాంత యత్యంతరుచి గలుగునట్లు పాకముజేసి పైడిపీటల నమర్చి వారింబిలిపించినది. వారు మిగుల నాకలిగొనియున్న వారగుట నాబంగారుపీటలపైఁ గూర్చుండిరి. పిమ్మట నాసుందరి జల్తారుపట్టుచీరం గట్టి మేల్కట్టు జరీపువ్వల మువ్వంచు కంచుకిందొడిగి వెలలేని పెక్కుతొడవులధరించి పదకటకంబుల ఘలుఘల్లుమని మ్రోయ గ్రొక్కాఱు మెఱుంగుతీగెలాగునఁ దళుక్కుమని మెఱయుచు జక్కవకఁవబోలె బైటలో గ్రెక్కిరిసియున్న చన్నుదోయినలదినకస్తూరితాపులు ఘుమ్మని దెసలావరించి నల్లనల్లన జనుదెంచి యోరచూపుల నాభూపాలుం చూచుచు బంగరుపాత్రలతో బంచభక్ష్యపరమాన్నములు వడ్డించినది.

అంత నాభూకాంతుఁడును మంత్రియు నాపదార్ధములు రుచి మెచ్చుకొనుచుఁ దృప్తిగా భుజించిరి. భుజించినప్పు డారాజు అమ్మానిని మేనితావి నాసాపర్వంబు గావించుటయు రెండుమూడు సారులు తల పైకెత్తి చూచెను.

అప్పు డయ్యతివ తనపై నెరపుచున్న వన్నెచూపుల చిన్నెలుకొన్ని పరిశీలించి తదీయరూపవిభ్రమవిలాసము లుల్లాసము గలుగఁజేయఁ గందర్పుఁడు తనడెందము నాసుందరి విభ్రమభ్రమితభ్రూయుగంబు కార్ముకంబుగాఁ జేసి తదీయకటాక్షవీక్షణమార్గంబులఁ బరితాపంబు బొందింపఁ బెంపుచెడి యాపొలఁతి వలపుచూపులం నట్టి చూపులంజూచి మరలించుచు నంతకంతకు కంతుసంతాపము వింతచేష్టలఁ బుట్టింప నతఁడు స్మరాపస్మారంబున మత్తలమందుచుండెను.

అట్టి వికారచేష్టలతోడనే భుజించిన విష్ణుచిత్తుని చిత్తవృత్తి యంతయు గ్రహించి మంత్రి సంతసించుచు నతని నొక భవనాంతరమునకుఁ దీసికొనిపోయి యం దమర్పబడియున్న హంసతూలికాతల్పంబునం గూర్చుండబెట్టెను. అప్పుడు