పుట:కాశీమజిలీకథలు -01.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుద్ధిసాగర కామపాలుర కథ

237

అప్పుడు దీర్ఘ దర్శి తాను దలచికొనిన కార్యము దీర్చుట కిదియే సమయమని నిశ్చయించి దైవానుకూలమును గుఱించి సంతసించుచు రాజుతో నిట్లనియె.

దేవా! యీ ప్రాంతమందొక సౌధముండుట నాకు జ్ఞాపకము వచ్చినది. అందొక రాజకుమార్తె నివసించియున్నది. ఆమె మార్గస్తులకు సదుపాయము చేయునని విని యుంటిని. అచ్చటికి బోవుదమే యనుటయు రాజు అంతకన్న మేలుస్నదా ! ఈ రాత్రి యన్నమును బొడిగుడ్డలు నిచ్చువారెవ్వరైన నున్నవారినే దైవముగా జూతుము గదా! యని పనికి యతనితోఁగూడ నామేడ వెదకికొనుచు నడిచెను. ఆ స్థలము మంత్రి యెఱిగియున్నదే. కావున గొంతసేపు త్రిప్పి తుదకు సాయంకాలమున కచ్చటికి దీసికొని పోయెను.

సుశీలకు మంత్రి యంతకుపూర్వమే వార్త నంపియుంచెను. ఆరాత్రి సుశీల యామేడంతయుఁ జక్కగా నలంకరించి దీపములం పెక్కు వెలిగించి యుంచెను. ఆమేడఁ జూచి రాజు మిగులవెరగందుచు మంత్రీ ! యింత వింతసౌధ మెవ్వరిది ? ఇందున్న చిన్నది యెవ్వతె! యెవ్వనికూఁతురు? యెవ్వనిభార్య? మగనితోడనే యిందున్నదా? యని యడిగిన నతనిమంత్రి యిట్లనెను.

దేవా! యీచిన్నది మళయాళదేశపు చక్రవర్తి కూఁతు రనియు విహారార్ధమై యిచ్చటికివచ్చి యిందు మంచిగాలి తగులునని మేడ గట్టుకొనెననియు వినియుంటిని. ఈమెమగఁ డిందుండెనో లేదో నాకు దెలియదు. మార్గస్థులకు మిగుల సదుపాయములు చేయునట. ఇందు గొన్నిదినములుండి మరల స్వదేశమున కరుగగలదనికూడ విని యుంటిని. ఆకథయంతయు మన కేటికి! ఈరాత్రి భోజనమిచ్చి పొడిపుట్టములిచ్చినం జాలదా? యనిపలుకుచు ద్వారముచెంతకుపోయి ద్వారపాలకులతో మంత్రి యిట్లనియె.

ప్రతీహారులారా! మేము మార్గస్థులము. వానతాకుడుచే మిక్కిలి యలసితిమి. మీయేలికసాని యీరాత్రి యిచ్చట మాకు నన్నవస్త్రము లిచ్చి యాదరించునేమో యడిగిరండు అనిచెప్పిన వారు సత్వరముగాఁ పోయి యావర్తమానము సుశీలతోఁ జెప్పిరి. అమాటవిని సుశీల మిగుల సంతసించుచు వారినిసత్కరించి తీసుకొనిరా బెక్కండ్రదూతికల నియమించెను. పరిచారకులు తదానతిపోయి అర్ఘ్యపాద్యాదివిధులం దీర్చి తోడ్కొనివచ్చి యొక విచిత్ర వనాంతరమందుఁ బ్రవేశపెట్టిరి. సుశీల మరికొందరిచేత పీతాంబరములు వారికిఁ గట్టఁబంపించెను. ఆపుట్టంబులఁ గట్టుకొని