పుట:కాశీమజిలీకథలు -01.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వారును నొకనాఁ డొకసత్రంబునం గలిసికొని యొండొరులు పలకరించుకొన యా చిత్రఫలకంబులఁ దులగా నిలబెట్టి యిట్టట్టు పరిశీలించి మేనులు పులకింపఁ దలకంపించుచు నోహో! ఇదివఱకింత దేశము దిరిగితిమి గాని యెందును ఇట్టిపొందు గుదిరిన ఫలకంబులం జూడలేదు. ఈరాజునకు నీరాజపుత్రి సరిపడినది. దాంపత్య మనుకూలముగా నుండునని తలంచుచు నొకరి పటంబు లొకరు గైకొని తమతమ యేలికలకడ కఱిగిరి.

విష్ణుచిత్తుఁ డాచిత్తరువు నందున్న మత్తకాశిని రూపంబు పరికించి చూచి తల యూచుచుఁ బ్రతిగాత్రమును వేరువేర వర్ణించుచు మంత్రితో నిట్లనియె. ఆర్యా! నా కీసర్వేందుముఖియందు డెందము దగులుకొనినది. దీనిపేరు సుశీలయట. ఆ పేరు సార్థకమై నిజముగా నిట్టి రూపము గలిగియున్నచో నాచిన్నదానిని నాకుఁ బెండ్లి చేయుమన మిగుల నిరాశతోఁ బలికెను. ఆమాటవిని మంత్రిమిగుల సంతసించి యా రాచపట్టి యట్టిదేయని యతనితోఁ బలుకుచు నప్పుడే పాండ్యదేశరాజునకు సుశీలను మారాజు వివాహమాడ నొడంబడిన వాఁడని శుభలేఖ వ్రాసెను.

పాండ్యదేశపురాజు విష్ణుచిత్తుని చిత్రపటము చూచినది మొదలు సుశీల కతఁడే తగినవరుడని నిశ్చయించెను. అతని మంత్రి వ్రాసిన శుభలేఖచూచి సంతోషముతో నందుల కియ్యకొనినట్లు తెలియపరచుచు శుభముహూర్తముగూడ నిశ్చయించి యప్పటికి దరలిరావలయునని శుభలేఖలు వ్రాసెను. అట్టి శుభలేఖ చదువుకొని విష్ణుచిత్తుడు తన కులాచారప్రకారము సకలవైభవములతోడ నా శుభముహూర్తమునకు దనకత్తి నిచ్చి మంత్రినంపెను. అచ్చట సుశీల తనకు వివాహప్రయత్నము జరుగుచుండ నంతకుమున్ను తాను చదువుకొన్న గురువుగారికి దక్షిణ నియ్యఁదలఁచి సాయంకాలమునఁ జక్కగా నలంకరించుకొని పసిఁడిపళ్ళెరమునిండ బంగారునాణెము లుంచుకొని యాయుపాధ్యాయుని యింటి కరిగి యాయన పాదంబులకు నమస్కరించి యిట్లనియె.

ఆర్యా! నేను మీయొద్ద విద్యాభ్యాసము చేసితిని. మీయాశీర్వచనప్రభావమున నాకీరాత్రి వివాహము జరుఁగబోవుచున్నది. వివాహమైన వెనుక నేను మీయింటికి రాఁగూడదు. తమ రీదక్షిణను స్వీకరించి నాకు వివాహమాడ ననుజ్ఞయిండని వేడుకొనెను. అప్పుడయ్యాచార్యుఁడు తదీయరూపవిలాసవిభ్రమంబులం జూప కామశరపీడితుండై యొడలెఱుంగక వివేకము మొద్దువోవ నాముద్దులగుమ్మ కిట్లనియె. తరుణీ! నాకీధనమేమియు నవసరములేదు. నీధనము నీవే తీసికొనిపొమ్ము. నీయను