పుట:కాశీమజిలీకథలు -01.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణదేవరాయల కథ

173

ప్రాయము గ్రహింపఁగలదు. అనిచెప్పిన సంతసించి రాజు ఆచేడియ జూడ మిగుల వేడుకపడిన దిమ్మర్సు రాయలతో అయ్యో! యింత తొందరపడియెదవేల? ఇప్పుడు బ్రాహ్మణుఁడు చెప్పినమాటలు వింటివిగద. కడు తెలివిగా నుండవలయు సుమీ ! అది మిగుల జాణ. మాటలచేతనే గ్రహించును. మనగుట్టు బయలైనచో మోసమురాఁగలదు. దానితో నేను మాట్లాడినప్పుడు నీ యభీష్టము తీరులాగునఁ జూచుకొనుము. ఇంతియ నీకు లాభమని కొన్ని విషయములు బోధించి మరునాఁడుదయంబున, బ్రాతకృత్యముల నిర్వర్తించుకొని రాజునగరి కరిగి ద్వారాపాలకునిచేఁ దనరాక రాజున కెఱింగించిన గోపాలుఁడును వారి నుచితసత్కారంబుల నాదరించి సుఖాసీనులైన వారితో వినయంబున నిట్లనియె.

అయ్యా, మీ దేశ మేది? ఇప్పు డెచ్చటికిఁ బోవుచు నిచ్చటికి వచ్చితిరి. స్వాగతంబే కద మీరాక నా కెంతయు సంతోషము గలుగజేసినది. నేను కృతార్థుండనైతి నని పలికిన నారాజు ప్రార్ధనావాక్యంబులకు దగిన ట్లుత్తరము చెప్పి, తిమ్మర్సు రాజా! ఇప్పుడు మేము కాశి కరుగుచున్నాము. మార్గంబున మీయశం బాలించి దర్శనముజేసి పోవుదమని వచ్చితిమి. మేము విద్వాంసులము మీ పుత్రిక పాండిత్యము గలదనియు బెక్కండ్రుఁ బండితుల నోడించెననియు విని యామెం జూచి నేత్రానందము గావించు కొని యామెతో గొంత ముచ్చటించి శ్రోత్రానందము గావించుకొనుటయే మాయభీష్టము. ఇంతకన్న వేరుకోరిక లేదని పలికినవిని, యారాజు మేలు మేలు ఇంతకన్న పండువేది. నాకూఁతురుఁ పండితు లనిన మిగుల సంతసించును. ఆలాగుననే చూడవచ్చును. మీకే విద్యలోఁ బాండిత్యము గలదో చెప్పుడు. ఇప్పుడే చీఁటివ్రాసి యాబోఁటి కనిపెదననిన వారు దమకు సకలవిద్యలలోఁ బాండిత్యము గలిగియున్నదని చెప్పిరి. గోపాలవల్లభుండును వారి స్థితియంతయు వ్రాసి యాచీఁటిని గూఁతున కనిపెను. దానిం జదువుకొని యమ్మదవతి మిగుల ముదముంది తక్షణమే ప్రవేశపెట్టు మని మరల చీఁటివ్రాసి తండ్రి కనిపినది.

రాజాజ్ఞప్రకారము సేవకులు వారిని గ్రమంబున ననేకకక్ష్యాంతరములు దాటించి కళానిలయనిలయంబునకుఁ దీసికొనిపోయిరి. ఆమె చెలికత్తె లాగదియం దొకచో రత్నకంబళి పరచిరి. వారు దానియం దుపవిష్టులైరి. ఆ గదియందు నలుమూలలను తదీయరాణీయకము విబ్రాంతస్వాంతులై చూచుచుండిరో యనునట్లు భూమియందు బ్రసిద్దులైన రాజుల చిత్రపటంబులు దర్పణంబులఁగట్టి యమర్పఁబడియున్నవి. దేవతావిగ్రహముల లెక్కగొన నెవరిశక్యము? త్రిలోకములలో రూపంబునఁ బ్రసిద్ధలైన స్త్రీల పటంబులును వేనవేలు గట్టఁబడియున్నవి. రాజును, తిమ్మర్సును, అందొకచో నొకపటంబున వ్రాయబడిన తమ రూపంబులం జూచి యించుకేనియు భేదము లేకున్నరీతి కెంతయు నద్భుతమందిరి.

మఱియు నందున్న స్త్రీల పటంబులకెల్ల వన్నెయిడుచున్న కళానిలయపటంబును జూచి తదీయవిలాసంబు విలాసంబున గ్రహించి మోహపరవశుండై నేలవ్రాల