పుట:కాశీమజిలీకథలు -01.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

విక్రమసింహా! రంగులతో వ్రాసిన విగ్రహమును జూచియే యింత విరహతాప మందుచున్నా వేమి? అయ్యో! మంచి ధైర్యశాలివే. ఇది నిజముగా రమణియైనచో నెంత విరాళిందూలెదవో గదా? చాలు చాలు. ఊరకుండుము. ఎవ్వరైనం జూచిన నవ్వుదురు. దీని నిజం బరసి నిజముగా నిట్టికాంత యీభూమియెం దెక్కడ నున్నను గన్యకయైనచో నీకుఁ బెండ్లి జేసెద. నీవోరుపు గలిగి యుండవలయు ననుటయుఁ దదీయవచనంబుల కెంతేని సంతసించి ప్రియవయస్యా? వయస్యునికీ యుపకారము వేగముగాఁ జేయఁ బ్రయత్నింపుమని దైన్యముగాఁ బ్రార్థించుటయు నతండు వల్లె యని యప్పుడు క్రమంబున నియ్యూరనున్న వృద్ధులనెల్ల నా చిత్రఫలకవృత్తాంత మడుగుటయు నందొక వృద్ధబ్రాహ్మణుం డిట్లనియె.

అయ్యా! మూడేండ్ల క్రిందట మళయాళదేశ రాజధానియగు ననంతపురము నుండి పుణీకుండను చిత్రకారుఁడు వచ్చి యచ్చట దీనిం గట్టిపోయెను. కట్టుటకు కారణము నాకుఁ తెలియదు. ఇంతియ మే మెఱింగిన వృత్తాంతమనిన విని మంత్రినందనుఁడు కొంత సంతసించి వాని నామంబును, గ్రామంబును వ్రాసికొని విక్రమసింహునితో నప్పుడ యప్పురంబు వెడలి కతిపయప్రయాణంబుల నయ్యనంతపురంబు సేరి తప్పురజనుల వలనం దెలిసికొని వాని యింటికరిగెను .

విపునికుండును వారి నుచితసత్కారంబుల నాదరించి కూర్చున్న పిమ్మటఁ గొంతసేపునకు వినయంబున నాగమనకారణం బడుగుటయు సంతసించి బహుశ్రుతుం డిట్లనియె.

విపుణికా! యీతండు చోళదేశపు రాజకుమారుండు నేను దదీయ మంత్రినందనుండ. మేమిరువురము దేశసంచారమునకై వెడలి తిరుగురు నీచేఁ గ్రౌంచపురంబుననున్న సత్రమందిరపు సింహద్వారమున వ్రేలంగట్టబడిన చిత్రఫలకముఁ జూచితిమి. అందు వ్రాయబడిన పడతుం జూచి మారాజనందనుడు విరాళిం దూలుచున్నవాడు.

అచ్చటి వారిచే నది నీచే వ్రాయఁబడినదని విని మేము నీచెంత కరుదెంచితిమి. అది నీవు బుద్ధిసూక్ష్మతచే వ్రాసితివా? అట్టి సుందరి యెందైనఁ గలదా? దాని యుదంత మెఱింగింపుమని యడిగిన నతండు మొగంబునం జిరునగ వంకురింవ వారి కిట్లనియె.

అయ్యా! నేనొకప్పుడు కాశీపురి కేగితిని. ఎచ్చటనుండియో కాని యప్పుడే యచ్చటికిఁ బురుషద్వేషిణియను రాజపుత్రిక వచ్చినది. సార్ధకనామముగల యాకలకంఠి పురుషులమొగ మెన్నండును చూడకపోవుటయే గాక యాందోళిక మెక్కి వీధి నరుగునప్పు డాపల్లకిని గూడ పురుషులు చూడఁగూడ దఁట. ఆ చిన్నది మణికర్ణికా