పుట:కాశీమజిలీకథలు -01.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

యెట్లు పలుకుదును? మొదటనే యాసుందరి నాభార్య కాదనియు నాకు బెండ్ యే లేదనియు జెస్సినచో నీముప్పు రాకపోవు గదా. వట్టిదంభము బెట్టికొనిన నెవ్వరికిని గీడు రాకమానదు. ఇప్పుడు నాకు భార్య లేదని చెప్పిన బరిహాసాస్పదుడ నగుదును. ఏమి సేయుదుసు. ఉపాయమేమి? అని ధ్యానించుచుండ వెండియు ముసలి యామె భోజనమునకు రమ్మని పిలిచిన నతండు వెనుకటివలెనే రానని చెప్పిన నాసన్న యెఱింగి యా కురంగనయన యతండు వినుచుండ నవ్వతో నిట్లనియె.

అమ్మా! సారెసారె కట్లు కార్యాతురత్వంబున జింతింపనేటికి ? ఒకమాటు నియోగించిన భృత్యుల వేరొకమాటు నియోగించువిషయ మాలోచింపవలయునా. సతతము దన్ను బోషించువారి కవసరము వచ్చినప్పుడు కార్యములు దీర్చుట భృత్యకృత్యమేగదా! కావున గార్య మెరింగించి నియోగింపవచ్చునని పలికిన విని సంతసించి ప్రవరుండు సంతోషముతో లేచి భుజించి రాజుచెప్పిన కార్యవృత్తాంతమంతయు నెరింగించిన నా యించుబోడి యిట్లనియె.

ఈ మాత్రపు పనికే యింత చింతింపవలయునా! అక్కార్య మేను సవరించి కృతజ్ఞత జూపించుకొనియెద గాక. ఏడందలములు నేడురకముల నగలు పుట్టములు దెప్పింపవలయును. స్నానఘట్టమున నేడు గుడారములు, నేడు గుమ్మములు గలుగునట్లు కట్టనియోగింపవలయునని కర్తవ్యములన్నియు నవ్వతో జెప్పున ట్లుపదేశించుటయు నా మంత్రియు నవియన్నియు నా తీరున సిద్ధపరచి ప్రయాణసమయ మారమణి కెరింగించెను.

అప్పు డబ్పోటి నీటులు గులుకు మేటి సోయగంపురూపు దీపింప సింగారించుకొని తానొక యాందోళికమున గూర్చుండి తక్కిన చతురంతయానములలో వింతలగు నగలను బుట్టములను బెట్టి తలుపులు మూయించి నడువ నియోగించినది.

మంత్రియు మిగుల నానందముతో నొక్క పల్లకీయెక్కి యాందోళికాసప్తకంబు దన వెంటరా బోయెల యెలుంగుల నింగిపగుల సముద్రస్నానంబున కరుగుచుండెను.

రాజును భార్యతో నంతకుమున్ను వెడలి మంత్రి గలసికొనెను. తదీయాందోళికాసందోహవాహకరజకకంఠనిర్ఘోషార్భటులకు వెరగందుచు నా చక్రవర్తి యాచతురంతయానము లన్నియు నెవ్వరివని ప్రాంతగుల నడుగ వార లవన్నియు మంత్రిగారి భార్యలవి యని యుత్తరము చెప్పిరి.

ఆ నుడువుల నా యొడయని యెడద సంశయాశ్చర్యపారావారంబున మునింగి వేదెరంగుల జింతించుచుండ గ్రమంబున వారందఱు స్నానఘట్టము జేరిరి.

అందు మంత్రి యెక్కిన యాందోళికముదక్క తక్కినవి యాపటకుటీరములలో