పుట:కాశీమజిలీకథలు -01.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రవరుని కథ

107

మొదట లొక దినసు చీనాంబరముగట్టి కెంపులుచెక్కిన నగలబూని తళుక్కురని నిజతనుద్యుతులు మెఱయ హొయలుగులుకు నడల జనుతెంచి వారిముంగల బైడిపాత్రల నమర్చి యందు పెక్కు పిండివంటకములతో మొదటి వడ్డన వడ్డించి పిమ్మట నయ్యలంకారములు తీసి మఱియొక దినుసు పుట్టంబును భూషణంబులు దాల్చి వారు భుజించుచుండ గావలసిన పదార్థముల నభిప్రాయ మెరింగి వడ్డింపదొడంగినది .

అప్పుడు రాజు రెండు విధములుగా గాన్పించిన యప్పాటలగంధిని నిరువురుగా భావించి వారి సోయగ మోరగంటం జూచుచు నోహో! యీతని కొక్కతరియే భార్య యని వింటి. యేకరీతి సొగసుగల ముగుద లిరువు రుండిరే! ఇంత యందకత్తె లెక్కడ దొరికిరో గదా! వీని యదృష్ట మేమి? మేలు మేలని యప్పడుచుల గురించి యాశ్చర్యపడుచు భుజించిన వెనుక యతనిచే సత్కారములనంది యింటి కరిగి భార్యతో విట్లనియె.

ప్రేయసీ! మన ప్రగడ కొక్కరితయే చక్కనిభార్ యగలదని వింటిమి గాని నిజం బరయ నిద్దఱు సుమీ. అన్నన్నా! యాయన్నులమిన్నలసొంపు మనము విన్నదానికన్న మిన్నయై యున్నదిగదా. తెరగంటి వాల్గంటులు వారియింట దాస్యంబునకైనం జాలరని యూహించెదను. చక్కదనం బొక్కటియేగాక దానికి వన్నెవెట్టు దీకౌశల్యము గూడ యున్నదిసుమీ. అది యెల్ల నడల యొయ్యారంబునను వడ్డన చమత్కృతిచేతను వెల్లడియైనది. అది అట్లుండనిమ్ము. తత్కృతమ్మగు పాకమున, బదార్థభేదమ్ముల కనిపెట్ట నెవ్వరితరంబు? రుచిపస చెప్పనేల?

ఒక్కటియే పెక్కువిధముల రుచి గలుగునట్లు వండినది. భుజించితిని గాని యేది యెట్టిదియో భేదమే తెలిసినది కాదు. బాపురే! అని యత్యాశ్చర్యముగ నామెను వర్ణించుచున్న నాథునిమాట లాలించి యాప్రోయాలు దానుగూడ నా చేడియలంజూడ వేడుక పడుటయు రేడు అందులకొక యుపాయ మూహించి మరునాడు సచివుని రప్పించి యిట్లనియె.

ప్రగ్గడా! మన మెల్లుండి వచ్చుచున్న యర్ధోదయంబునకు సకుటుంబముగా సముద్రస్నానమున కరుగుదము. మహాపర్వంబుల దీర్థంబులయందు భార్యలతో వలువచెరంగుల ముడివైచుకొని క్రింకినచో నెక్కుడుపుణ్యము గలుగునవి విద్వాంసులు చెప్పుదురు. అట్టి ప్రయత్నము గావింపుమని యభిలాషపూర్వకముగ జెప్పిన విని యెడద దిగులువడియు సంతసము మొగమునం దభినయించుచు వల్లె యని యింటికరిగి మునువోలె విచారగృహంబునం బండుకొని యిట్లు ధ్యానించెను.

పాప మీచిన్నదాని యనుగ్రహమున నొకయాపద గడిపితిని. పరకాంతను వంట చేయుమనిన గొంతయుక్తముగా నున్నది గాని సరిగంగాస్నానమాడ రమ్మని