పుట:కాశీమజిలీకథలు -01.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

చింతించుచుండును. ఇన్ని దినములై నది. నీ వెవ్వడవు. నీ వృత్తాంతమేమని న న్నడుగలేదు. ముసలామెయు మాకన్న మనసు దిట్టముది. మా కాపురముగు ట్టిన్నినా ళ్ళొరు లెరుగకుండ నిలుపుకొని వచ్చితిమి. ఇప్పు డేమి చేయుదును. నాకు భార్య లేదంటినా మిగుల హాస్యాస్పదముగా నుండును. వినినవారును నమ్మరు. నిప్పల్లవపాణి నా భార్యయే యని తలంచుచున్నారు. దాని యునికిచేతనేకదా నే ముట్టినది బంగార మగుచున్నది. నా కితండు భార్యచేతనే వండించి వడ్డింపజేసెను. నే నీయవ్వచే వడ్డింపజేసితినేని మర్యాదహీనముగా నుండును. అదియునుంగాక యీమెం జూచుట కొరకేగదా యతం డీవిందులు గల్పించుట. హా! దైవమా! ఈయాపద యెట్లు దాటునో గదా యని ధ్యానించుచు నట్లే పండుకొనియుండెను.

వృద్ధబ్రాహ్మణియు యథాప్రకారము ప్రవరుడు భోజనమునకు రాకపోవుటచే నతనియొద్దకుబోయి భోజనమునకు లెమ్మని పిలిచినది. అతం డవ్వా! నా కీ దినమున నాకిలిలేదు. భోజనము చేయను. మీరు భుజింపుడనుటయు నామెయు బహువిధముల నిర్బంధించెను. గాని యామె ప్రయత్నమేమియు గొనసాగినదికాదు.

అట్లు లేవకయే పరుండి యుత్తరము చెప్పుచున్న ప్రవరుని మాటలన్నియు వినుచున్న రాజపుత్రిక తన బుద్ధిసూక్ష్మతచే నతని విచారకారణము గ్రహించి యతనియందు బద్ధానురాగయై యున్నది గావున నతడు వినుచుండ నా బ్రాహ్మణితో నిట్లనియె.

అవ్వా! బుద్ధిమంతు లల్పకార్యవిషయమై చింతించుచు నజ్ఞులువోలె భుజింపమానుట తగునా? తమ పోషకత్వములోనున్నవారిచే దీరవలసిన కార్యము లెవ్వియేని గలిగినచో నుడివినం దప్పా? ఒకవేళ బలకరించినచో దగుల మెక్కుడనని వెరపు గలిగియున్న దేమో? హృదయంబున నట్టి భీతిగొన నవసరములేదు. దైవప్రతికూలదినములలో మిత్రులు మాత్ర ముపచరింతురా? మే మిట్లు చెప్పదగినవారము కాము. అయినను పోషకవిశ్వాస మూరకుండనీయకున్నది. భుజించినవెనుక కార్య మెరింగించి నియోగింపవచ్చునని పలికిన నాపూబోణివాక్యంబులకు సంతసించి యతం డప్పుడ లేచి భుజించిన వెనుక యవ్వతో జెప్పినట్లు కార్యవృత్తాంత మంతయు నెరింగించుటకు నమ్మించుబోణియు నిప్పనికింత చింత యక్కరలేదు. వంట జేయుదు. విందునకు బిలువవచ్చునని యతండు వినుచుండ నవ్వకే చెప్పినది.

అంత మరునా డారాజపుత్రిక గ్రొత్తరుచు లుప్పతిల్ల బెక్కువిధముల వండి వంటలతో బాకంబు చేసి సిద్ధపరచిన బ్రవరుడును రాజు నుచితసత్కారంబుల దోడ్కొనివచ్చి భోజనారగారంబునం గనకసుమవిరాజమానంబగు పీఠంబున గూర్చుండబెట్టి వడ్డింపుమని యమ్మానవతి కానతిచ్చిన నాచతురయు నృపతిమతి యెఱింగి