పుట:కాశీమజిలీకథలు-12.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

యుచు మణికర్ణికాఘట్టము జేరనఱిగిరి. గోపా ! కాశీమహిమంబు వింటివా ! పంచ క్రోశవైశాల్యంబుగల యీ క్షేత్ర ముత్తరవాహినియగు గంగాతీరంబున నున్నది. ఇందు విశ్వనాధుండు ముఖ్యదేవుఁడు బిందుమాధవస్వామి క్షేత్రపాలకుండు. భైర వుండు పుర రక్షకుండు, అన్నపూర్ణ విశాలాక్షియను బేరులఁ బరగియున్న దేవియే ముఖ్యశక్తి, డుంఠి మొదలగు వారు ఆవరణ దేవతలు. ఇమ్మణి కర్ణిక తీర్థముఖ్యము. మఱియు ననేక కోటిలింగములును మహాశక్తులును గలిగియున్నది. ఇది ముక్తి స్థానము. అని చెప్పుచు మఱియు నిట్లనియెను. గోపా !


సీ. పసిఁడికుండలచేతఁ బ్రభఁగాంచి యలరారు
           నదియె విశ్వేశుని యాలయంబు,
    ఆప్రక్క గోపురోద్దీపితం బగునది
           యన్నపూర్ణాదేవి యున్నతావు,
    పొడవైన కంబముల్కడఁ‌ జూడఁబడునది
           బిందుమాధవదేవు మందిరంబు,
    రమణీయ మణిశేఖరములచే నొప్పారు
           నదియె డుంఠీశుని సదనరత్న,

గీ. మల్లదియె చూడు మందు రాజిల్లునదియె
    దండపాణి వసించు సుందరగృహంబు,
    కాశినగరి తలారి యక్కాలభైర
    వుని నికేతన మదియె కేతనము గలఁది.

సీ. మణికర్ణికాతీర్థ మణియియ్యదే చూఁడు
            మ‌ధికపుణ్య ప్రదం బదియెకాశి
    సత్యంబునకు హరిశ్చంద్రుండు మును వల్ల
            కాఁడు గాచినయట్టి ఘట్టమదిగొ
    పరమేష్ఠి యతినిష్ఠిఁ బదియశ్వమేధమ్ము
            లాచరించిన ఘట్టమదిగొ కనుము
    కేదారఘట్ట మామీఁద నున్నదియె క్షే
            మేంద్ర ఘట్టంబదియే పవిత్ర

గీ. యదియె హనుమంతు ఘట్ట మయ్యదియె చక్ర
    పుష్కరిణిబ్దునదాపి యామూలనొప్పు
    నది తదద్భుత మహిమ నెల్లపుడు సురలు
    బొగడుదురు ముక్తిమంటపంబున వసించి.