పుట:కాశీమజిలీకథలు-12.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపోతపక్షుల కథ

297

లము మాజీవన మొక జీవనమా ! తినుటకు మిగిల్చి కూడబెట్టుకొనుట మాయాచారము కాదు. యెటుల నీయాకలిందీర్పగలనని యోచించు ప్రియునితోఁ గపోతి యిట్లనియె. నాధా ! మీకీ వగపేటికి నేను గలిగియుండ మీకేమిలోపము నన్నీ జిక్కంబునుండి విడిచిపుచ్చుము నామే నీయతిథికి నాహిరంబుగ నిచ్చెదను. దాన నతండు తృప్తిఁ జెందును. త్వరపడుఁడని బోధించిన నాకపోతంబు కటకటంబడుచు వడివడింజని నయ్యగ్నికి వలగొని వానికి నాశరీరమర్పించెదనని నుడువుచు నయ్యగ్గింబడెను. అది చూచి నాకోయ విభ్రాంతుఁడై కొంతవడికి నిశ్చేష్టితుఁడై యుండెను. బదంబడి తన పాప కృత్యంబునకును పిట్టల సాహసంబునకును తలపోసి పశ్చాత్తప్తుఁడై లేచి వలలో నున్న పునుగులనెల్ల విడిచిపుచ్చి నేడు మొదలు నిరాహారుండనై ఘోరకృత్యముల చేయుట మానగలవాడనని శపధముఁజేసి శాంతుడై నుండునంత బోయచే విడువబడిన నాకపోతియు భర్తందలంచుకొనుచు నయ్యగ్నికి ప్రదక్షణముజేసి యందుపడెను. అంత నాపక్షి యుగ్మంబు దివ్యశరీరములందాల్చి విమానారూఢులై గంధర్వులు గొలువ నుత్తమ లోకంబుల నొందెను. అని చెప్పిన సంతోషించు శిష్యునితోఁగూడ తదనంత రావసధము జేరెను.

358 వ మజిలీ

ఈయవసధంబున మణిసిద్ద యతీంద్రుఁడు కాల్యకరణీయంబులంఁ దీర్చు కొని, శిష్యునిరాక నరయుచున్నంత, నగ్గోపాలుఁడు వాడుకరీతి నూరిలోనికరిగి తిరిగి వచ్చి, గురువరునకు నమస్కరించుచు నిట్లనియె. స్వామీ ! మీయనుగ్రహాతిశయంబున నేనెన్ని యేని ధర్మంబుల వింటిని మనము కాశీపట్టణంబునకు హుటాహుటీ నడకలఁ బోయిన నెప్పటికిఁ జేరగలమని కాశీసందర్శనోత్సుకుండై బలుకు శిష్యునిజూచి గోపా ! నీ యభీప్సితంబు వడువున వేగముగా ప్రయాణమైపోయిన ఱెండుదివసంబులలో మన మాపట్టణంబు జూచుభాగ్యము కలుగఁగలదు. నీవుపోయి భుజించిరమ్ము అనుటయు వాఁడును భుజించివచ్చిన, వారిరువురు నట గదలి యతిజవంబున మఱుసటిదినము సంధ్యాకాలమునకు యేకోనషష్ట్యత్రింశతతమ నివాసస్థానంబు జేరిరి. వారందారేయి గడిపి మఱునాఁటి యుదయమునలేచి కాల్యకరణీయంబుల దీర్చుకొని గోపుఁడు కావడి మూపునబూని దోడరా నయ్యతిచంద్రుఁడు ప్రణరాక్షరజపంబుఁ జేసికొనుచు కాశీ నగర సందర్శన వ్యగ్రచిత్తుఁడై మనంబునగల తొందర గమనంబున గాన్పింప నాటి మధ్యాహ్న కాలమునకు సకలకైవల్య కల్యాణజన్మనిలయంబగు నా వారణాసి పురంబున ప్రవేశించిరి.

359 వ మజిలీ

కాశీపుర ప్రవేశము

మణిసిద్దయతీంద్రుడు కాశీమహిమ నంతయు నంతకుమున్ను మణిప్రభా వంబున నెఱిగియుండుట నొరుల సహాయములేకయే యందలి తీర్థవిశేషంబుల నఱ