పుట:కాశీమజిలీకథలు-12.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ప్రియునకుఁగల ప్రేముడికి సంతసించుచు పతిచేత మెప్పువడసిన కారణంబున ధన్య నైతినని తలంచుచు, సన్ననియెలుంగున చెట్టుకొమ్మపైనున్న తనభర్త కిట్లనియె.

నాథా ! పూర్వభువనంబున మనమెట్టి పాపకృత్యములఁ జేసియుంటిమో దానికతనిబున మనమిట్లెడబాసి యుంటిమి. దైవనిర్ణయమునకు మనమేమిచేయఁగలము! కాఁగలది కాకమానదు.


ఉ. ఎవ్వరిఁ దొల్లి జన్మమున ◆ నీక్రియబాధలు వెట్టి బిట్టుగా
    నొవ్వఁగ జేసి నా మొక్కొవి ◆ నోదముతోఁ గనుఁగొందు నెంతయుం
    గ్రొవ్వునఁ, దత్పలంబిపుడు ◆ కూడె భరింపకపోదు పాపముల్‌
    నవ్వుచు జేయుచుం గుడుచు ◆ నాఁడు విచారమువడ్డ నీగునే.

మ. ఎటనెంతేని కెన్ని రేల్సుఖముగానీ దుఃఖమున్గాని వి
     స్ఫుట పూర్వాచరితాత్మకముల్‌ వశతన్భోక్తవ్యమై యుండునో
     ఘటనాదాతురిం ద్రాళ్ళఁగట్టుచు బలాత్కారంబుగా వాని న
     చ్చోట్కిందోడ్కొనివచ్చి దానిగుడించు నేదైన మనాళ్ళొగిన్‌.

ఇందుకై నీవు వగవంబనిలేదు మనము ధర్మపదంబున ప్రవర్తించిన నిహంబున కీర్తియు పరంబున సుఖమును గలుగును. నాథా ! యీ నాప్రార్థన నంగీక రించి మన చెట్టునీడకు సీతవాతభయంబున నొకయభ్యాగతుఁడు వచ్చి పడియుండెను. వానింజూడుఁడు. వాఁడు మనకు సహజ శత్రుఁడై నను యభ్యగతుండును యార్తుం డును నగుటంజేసి వానికి నీయోపిన సహాయముఁజేసి జన్మంబు సార్థకంబుఁజేసి కొనుము. గృహస్థధర్మములోని కెల్ల నుత్తమమైవ థర్మము యతిదభ్యాగతులఁబూజించు టయే యని పెద్దలుఁ జెప్పుదురని విని నాకపోతంబు చెట్టుకొమ్మనుండి నొక్కగంతున నెగిరివచ్చి తన పెంటింజూచి మిగుల వాపోవదొడంగెను.

అంత నాకపోతియు ప్రియవాక్యంబుల ప్రియుని దుఃఖోపశాంతునిఁజేసి యభ్యాగతుని పూజించుటకు ప్రోత్సహించెను. కపోతంబును తనప్రియురాలి విజ్ఞానంబు నకు సంతిసించి నాబోయయొద్దకుంజని తన జాతింజెప్పి యిట్లనియెను. ఓ మహాభాగా ! నిన్నుంజూడ నాకు జాలివొడముచున్నది నీవు మాయింటి కతిధివైతివి. నీయభీష్ట మొసంగుటయే నా కర్తవ్యము. నీకేమికావలయునో తెలుపుమనిన నాకిరాతుఁడు నొకిం చుక చెకితుఁడై తెలివితెచ్చుకొని తనకీబాధ పోగొట్టుమని కోరినంత నా కపోత మా చెట్టునున్న యెండుకట్టియలను పత్రంబులనేరి చెట్టుక్రింద ప్రోగుపెట్టి సమీప పల్లె కేగి మండుచున్న కాష్టంబొకటి నోటగఱచుకొనివచ్చి చితుకల ప్రోవునతగీలించి తనరెండు రెక్కల చేతను ప్రజ్వలింపఁజేసి దాన వానిశీతబాధఁ బోగొట్టెను అంత నాకిరాతుఁడు శీతబాధ బోగొట్టినట్టు నాకు తినుటకేమైననిచ్చి తనయాకలిం దీర్చ ప్రార్దించుటయు నందులకా కపోతము చేయునది లేక తలవాల్చి‌ వాని కిట్లనియె అనఘా! మేము పక్షు