పుట:కాశీమజిలీకథలు-12.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కపోతపక్షుల కథ

295

గొప్ప స్కంథముతో నొప్పుచు మిగుల ప్రఖ్యాతివహించి యుండెను. మఱియు నత్త రువు సులభముగా జనుల కారోహించుటకు శక్యముగానిదగుట ఘాతకులవలనఁ దమ కపాయంబు రాదని తలంచి శాఖాంతరములందును గోట రోదరములందును నానాశుక సంతతులు గూడులుకట్టుకొని హాయిగా సుఖించుచున్నవి. అందురెండు కపోతపక్షులు జాతిపులుగలతోఁబాటు! పిల్లలతో గాపురము చేయుచుండెను.

అంత నొకనాఁడొక కిరాతుఁడు కఠినమైవ యవయవములతో నెఱ్ఱని దృష్టులుగల్గి కృతాంతుని‌ యపరావతారమోయన పక్షి కులము పాలిఁటి మారిమై వెట తమకంబున నయ్యరణ్యమున వలలొగ్గియు, జగురు గండెలను పరిపియు, నుండ బద్దను కొట్టియు వేరువేరు ఫలమువలె పెక్కురకముల పిట్టలంబట్టి చంపియును చంపకయును చిక్కములోజేర్చి తృప్తినొందక దురాశతో నందందు తిరుగాడుచుండెను. అట్టిసమయ మున ననంతవేగ వాతోద్దూతంబై జీమూతసంఘంబుఁ లొక్కపెట్టునఁ పుడమి యిట్టట్టుగదలఁ గర్జించుచు నాకసమంతయు నావరించి తళుక్కుమను మెఱపులు చూపు లకు వెఱపుగొలుప, తెఱగెఱుంగని యిరులుగ్రమ్మ బెనుజడి గుమ్మరింప నిబ్బోయ నగ్గాలివానలో నిలువనెందును దావుగానక యత్యంత దుఃఖాక్రాంతుడై మన్నును మిన్నును దెలియనేరక క్రమంబున గపోతములుండు నబ్బూరుగునీడఁజేరి పక్షులఁ బెట్టిన చిక్కమొకచో నుంచి యాకలిచిచ్చునకుతోడు చలియుఁ దన్నుఁ పెద్దగాబాధింప వడవడ, వడంకుచు తడిగుడ్డలం బిండుకొని నీరులేనియొక సమతలంబున జతికిలఁబడి తనపాటునకుఁ జింతించుచు చెట్టువంకఁజూచి “వృక్షముననుండు నోవనదేవతలారా ! దీనుని ! అర్తుని ! నన్ను కరుణాదృష్టింజూచి నాకిరేయి సహాయముజేసి నాప్రాణంబులు రక్షింపరే !” అని మొఱ్ఱవెట్టుచు జీవచ్ఛవమువలె నొదిగి పడియండెను.

ఆచెట్టుకొమ్మ పైనున్న నొక కపోతము మేతకై నరణ్యంబున కఱిగిన తన పెంటి రాకునికిఁ జింతించుచు యిట్లని విలపింపదొడంగెను. అయ్యో ! దైవమా ! నా పెంటి యింకను రాకున్నది వచ్చెడు వేళయు మిగిలినది ఈ వానతాకున నెందేని పడి యుండెనో లేక యే కిరాతునిచేతనైన పట్టువడెనో? తెలియజాలను హా ! హతవిధీ యేమి చేయువాఁడను? గుణవతియు నైహికాముష్మిక సాధనంబును నగు నా పెంటి లేని కార ణంబున నీమందిరమిప్పుడు పాడుపడియున్నది. ఇంక నాకేది దిక్కు!


    సాధ్వి ! నీయట్టిపతి యెన్ని జన్మంబులకు
    నైన దొరకునె ! తలక్రిందుగాను నిలచి
    తపముజేసినకాని సీ ! తలచిచూడ
    వట్టి నిర్భాగ్యుడైతి జివురకునేను.

అని యిట్లు దానిచర్యలన్నియు నుగ్గడించి వాపోవుచుండ నాకిరాతుని చేఁజిక్కి చిక్కంబున జిక్కియున్న కపోతి తన యునికికివగచుచు తనయందుఁ దన