పుట:కాశీమజిలీకథలు-12.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

నేనేమియుంగోరరు. నాకధినాధుండైన శ్రీ కాశీవిశ్వనాధుండు దప్ప నితరుల యనుగ్రహంబుతో నాకేమియుం బనిలేదు. పొమ్మని పలుకుటయు నంత బిడౌజుండు కటకటంబడి త్రిలోకంబులకుఁ ప్రభువగు నాకన్న నధికుండెవండు గలడు? నాయను గ్రహంబేల వృధజేసి కొందువు? వరంబు వేఁడుకొనుమని క్రమ్మఱనడుగ నబ్బాలుండు విసిగికొనుచు చాలు ! చాలు ! నాతపోవిఘ్నంబుచేయక వేగమ వచ్చినదారిం బొమ్మని ధిక్కరించిన నా మరుత్వంతుఁడు నలుకమై వజ్రాయుధంబెత్తినాబాలునిపైఁ బరసిన తోడనే యాబాలతపస్వి భక్తి తాత్పర్యంబుల నుమానాధుని దలంచుచు యద్ది వ్యలిం గంబు మ్రోలమూర్చాక్రాంతుఁడై పడెను. అంతలో -


శా. సామేనంబొలుపొందు నిందుముఖితో, జర్మోత్తరీయంబుతో
    సోమార్దంచిత మౌళితో? గలరస చ్చూలంబుతో దేవతాఁ
    స్తోమారాధిది పార్శ్వభాగములతో, శుభ్రాంగక శ్రేణితోఁ
    గామారాతి తదగ్రదేశమున సాక్షాత్కారమయ్యెను గృపన్‌.

అట్లు ప్రసన్నుండై యప్పాలాక్షుం డాబాలునాదరించి వత్సా ! లెమ్ము. నేను నీయిష్టదైవ‌తంబగు కాశీవిశ్వేశ్వరుండనని బలుకుచు వాని‌ గాత్రంబంటుటయు నబ్బాలుండు నిద్రఁబోయి మేల్కొనినట్లు లేచి యెదుటనున్న పినాకపాణి నీక్షించి సమధిభక్తి పురస్సరంబుగా ననేక విధంబుల స్తోత్రంబులఁజేసి వానిని సంప్రీతునిఁగా జేసెను.

పిమ్మట శశిశేఖరుండు సుందరమందస్మిత ముఖారవిందుఁడై వైశ్వానరునిఁ గరుణించి విశ్వోత్తరంబైన యగ్నిలోకంబున కధినాయకుండవై పరమపవిత్రుండవై సమస్తజగదాధార భూతుండవై చెలంగఁగలవని వరంబులొసంగి యంతర్హితుండయ్యెను.

గృహపతియు నీశ్వరానుగ్రహంబున సపమృత్యువుం జయించి మృత్యుం జయుని మెప్పించి దిక్పతిత్వంబునంది మహాసంతోషంబున మగుడి నిజనివాసంబున కేతెంచి జననీజనకుల కావృత్తాంతమంతయుం జెప్పి యానందమొందఁజేసెను. ఆతండే వైశ్వానరుఁడను పేర నాగ్నేయ దిక్కున కధిపతియైయండె. అనిచెప్పిన నగ్గోపా లుండు సంతసించి గురువరా! కపోతపక్షులు తిర్యగ్జంతువులు కదా ! గృహస్తాశ్రమ ముననవి యెట్లతిధిం దృప్తిఁజేసి ముక్తింనొందె? నాకథ చెప్పుమని ప్రార్థించిన మణి సిద్దుం డిట్లు చెప్పదొడంగెను.

357 వ మజిలీ

కపోతపక్షులకథ

గోపా! వినుము పూర్వకాలంబున నొక మహారణ్యమధ్యంబున నొక శాల్మలీవృక్షముగలదు. అత్తరువంబు శాఖాసమూహములని దిగంతరముల నావరించి