పుట:కాశీమజిలీకథలు-12.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

గృహపతి కథ

293


    నవమమాసమున నన్న ప్రాశనమచేసె
               నవరసంబులతోడ చవులుమీఱ
    గర్భాష్టమంబున నర్భకునకు జౌల
               ముపనయనముజేసె నొప్పుమీఱ

తే. గీ. అవల నుత్తముఁడగు నుపాధ్యాయునొద్ద
        పదముక్రమమును జటయును బరగఘనము
        ననెడురీతుల నెంతయు నతిశయిల్ల
        సాంగమగు వేదమంతయుఁ జదువఁబెట్టె.

గృహపతి నామంబుననొప్పు నా బాలకుఁడు రూపమున మనోహరుండై బాల్యముననే శాస్త్రపరిశ్రమజేయుచు శుక్లపక్ష సర్వరీకాంతుండువోలె దినదినాభివృద్ధిం గాంచుచు నచిరకాలముననే సమస్త విద్యలందును ప్రవీణుండయ్యెను. ఇట్లుండ నొక నాఁడు యదృచ్ఛాగతుండై గృహపతియను బాలకు నీక్షించి చేరందీసికొని ముద్దుఁ గొనుచు హస్తరేఖలం బరీక్షించి సాముద్రిక శాస్త్రంమునఁజెప్పిన శుభలక్షణంబులెన్ని గలవన్నియు నిక్కుమారునియందు సంపన్నములై యున్నయవియన తల్లి దండ్రుల కెఱింగించుచు యిన్ని సుగుణములు గలిగియున్నను వీనికి దంభోళి కారణంబున గండమున్నదనిజెప్పి యెందేనిం బోయెను.

అతని నిసాతదారుణంబైన యమ్మునిమాటల కా విప్రదంపతులు భయపడి హాహాకారము లొనర్చుచు బహుప్రకారంబుల విలపించుచుండ నబ్బాలకుండుచేరంజను దెంచి వారిశోకం బుపసంహరించి కాశీవిశ్వేరు ననుగ్రహంబున మృత్యువు నన్నేమియు జేయలేదని వారికి ధైర్యముఁజెప్పి మఱియు నిట్లనియె.


మ. వినుఁడీ నాదుప్రతిజ్ఞమీర హృదయద్వేగంబు వర్ణించి యో
     జనయిత్రిజనకుల్ ! గురుల్‌ భవదనుజ్ఞాముద్రచేపట్టి యేఁ
     జని కాశీపతి విశ్వనాయకు శివుం జంద్రార్థ చూడావతంసుని
     మృత్యుంజయు నాశ్రయించి విగతాసున్‌ జేసెదన్‌ మృత్యువున్‌.

అనిన విని యాదంపతులు యా మాటకు సంతసించి వల్లెయని విశ్వనాధుని కరుణాకటాక్షంబులం బడసి రమ్మని దీవించుచు వాని నొక శుభముహూర్తంబునఁ గాశీపురంబున దపంబు సేయఁబంపిరి.

గృహపతియు కాశికిం బోయి యొక్క పుణ్యాశ్రమంబున నీశ్వరలింగ స్థాపనం బొనర్చి తత్సమీపంబున దద్దయుం బెద్దగా దపంబొనరించుచుండె. ఇట్లాబాల కుండు ఘోరతపం బొనరించుచుండఁ ద్రిలోకభర్తవానిసన్నిధికేగి నేనింద్రుఁడ. నేను ఎన నాగ్యహపతి లన వలం సంగ్‌