పుట:కాశీమజిలీకథలు-12.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

జలాధిదేవత కథ

287

ధరుఁడగు నమ్మహాముని కెగ్గుచేయనెంచిన వారిని పరమేశ్వరుండు సహింపఁడు. కావున శీఘ్రము వాని నిందు దెప్పించి మాకప్పగించుము. లేదేని పరమేశ్వరుని యాగ్రహంబు నకు పాత్రురాల వయ్యెదవని యమ్ముదివ మదికి బెదురు గదురఁ బలుకుచున్న వానికా వామాక్షి యిట్లనియె.

అయ్యా ! విశ్వేశ్వరుని యాదేశంబును శిరసావహింపని వారెవ్వరుఁగలరు ! నేను నాదేవుని యనుజ్ఞ వడువుననే యా మునికుమారు నిందు దెచ్చితిని. ఇట్టి నాపనికి పినాకపాణి కాగ్రహం‌ బెట్లువచ్చును. ఆ యుదంతంబు సాంతముగ‌ నెఱింగింతునని యిట్లని చెప్పఁదొడంగెను.

ప్రమద్వరయను పేరుగల మా తనయకుఁ దగిన వరుం డెచ్చటను లభింప కునికి నాభర్త వారణాసికేగి యందు విశ్వనాధునిఁగూర్చి పెద్దతపంబు సేయ వాని కా దేవుండు ప్రత్యక్షమై కర్దమముని యాశ్రమ సమీపంబునంగల కాసారనీరంబుల నొక పద్మయంత్రము నిర్మించి యుంచుమనియు పిమ్మట కొన్నిదినంబుల కమ్మహర్షి తనయుండు నీసహధర్మిణి నివాసంబునకుఁ జేరఁగలడనియు వచించి యంతర్దానుఁ డయ్యెను. నీనా యాదేశంబు వడువున నొకయద్భుత పద్మయంత్రము నిర్మాణంబుఁ జేయించి యానీరంబుల నుంచితిమ. అది దూరమునుండి చూచిన వింతకాంతుల వెద జల్లు పద్మంబువలె గనిపించును. అది యందున్న పర్యంతము పత్రనిమేలనోన్మీలనం బులు క్షణక్షణంబులై యుండి యక్కజము గొల్పుచుండును. సన్నిధికేతెంచినతోడనే యదృశ్యమగుచు తామరపాకువలె నీటి‌పై దేలియాడును. ఆ పత్రంబును చేతితో దాకిన నది యొక దివ్యపర్యంకంబై యట్టివారిని నా యంతర్గృహంబునకుం దోడ్కొని వచ్చి యదృశ్యమగును. ఇట్టి పద్మయంత్రం బమ్మహాదేవుని యనుమతంబున నిర్మించి యందుంచితిమి ఆయంత్రసహాయమున‌ నమ్మునికుమారుం డిందు విచ్చేయటకు శివునియాజ్ఞయని దలంచితిమి. అది యట్లు జరుగక యొకగంధర్వపతి యక్కుమారుని యీశ్వరప్రేరణంబున నిందు దోడ్కొనివచ్చి నాకప్పగించిపోయెను. వాని నా క్షణమ నా భర్తసన్నిధికిఁ బంపితిని. ఈశ్వరుఁడు పద్మయంత్ర మేమిటికి నిర్మింపజేసెనో తెలియదు. కర్దమపుత్రుఁడు తన్ను మోసముఁ జేసి యిందుఁ జేర్చుటకుఁ గినియుచు నబ్బాలికామణిని పరిగ్రహించుట కిష్టపడుటలేదని యింతకుముందే నాభర్త నాకు వర్త మానముఁ బంపెను. ఇదియే జరిగిన వృత్తాంతము. ఇందు మా తప్పేమిగలదో మీరే నిర్ణయించ సమర్దులని యూరకున్న దాని మాటలకా ప్రమధుఁడు నివ్వెఱఁ జెందుచు నిట్లనియె.

శగినవపందని వంచు బం పెను. జనకుని యనుషతంబు