పుట:కాశీమజిలీకథలు-12.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

సదనంబున సుఖంబున నున్నట్లుఁ దెలిసినదిగదా ! పిమ్మట చేయవలసిన కృత్యమునకు దేవరయే కర్తలని యూరకుండెను.

353 వ మజిలీ.

అంత నా ప్రమధుఁడు తానింతకుముందుఁ జూచుచుండిన పద్మంబును స్మరణకుఁ దెచ్చుకొనుచు దానికీలెఱింగిన కతంబున నమ్మగువను నిర్జింపగలనను ధైర్య ముతో గంధర్వకుమారుని వెంటఁగొని యా పుష్పంబున్న వైపునకు బిరబిర నడచి పోయెను. పద్మము యధాప్రకారమచట ప్రత్యక్షమయ్యెను దానింజూచి యపరిమితో త్సాహముతో గంధర్వకుమారా ! నీ వింతదనుక జెప్పిన మాయా పద్మంబల్లదిగో చూడుము దీని నైజంబెఱుంగఁజాలక నేనింత పర్యంతము తహతహం బడుచుంటిని దీనిమర్మంబు నీవలనఁ గొంతఁ దెలియవచ్చినది కావున నింక శంకలేదు. దూరమం దుండుటచే మనకిప్పుడది గోచరించుచున్నదిగాని సన్నిధికేగినతోడనే మాయమగుచుం డును. మనమద్దాని సన్నిధికేగి పద్మముకొఱకుగాక తామరపాకుకొఱకు ప్రయత్నింప వలయునుఁగదా ? అని పలుకుచు వారిరువురు నా పద్మముదాపున కేగినతోడనే యది యధాప్రకార మదృశ్యమైనది.

అంత నా ప్రమధుండు విమర్శింప తామరపాకు గనంబడిసది. దానిని నిఱువురొక్కమారుగనే దాకుటయును నా పుండరీక మొక యద్భుతపర్యంకముగా మారి చక్రమువలె పరిభ్రమించుచు నా యిరువురఁ బైకెక్కించుకొని క్షణములో దివ్య యానమువలె యెందోఁబోయినది ఆ యాశ్చర్యదృశ్యమున కచ్చెరువందుచు నా పర్యం కంబుమీద నాసీనులై వారుండిరి. ఇంతలో నయ్యది జలాధిదేవత సౌధోపరిభాగంబున నొక గదియందుజేరి నిలచినది.

వారిరువురు విస్మయావేశ హృదయులై పర్యంకంబు డిగ్గి నలుమూలలు పరికించుచుండ నొకవేదండయాన వారున్న గదిలోనికి వచ్చెను. దానినింజూచి సుబా హుండు గుర్తించి నారీమణీ ! ఇతడీశ్వరకింకరుఁడు ! మునికుమారు నన్వేషంబున వచ్చినవాఁడు. ఇప్పుడైన వానిదెచ్చి యిచ్చెదవా ? లేదా ? తెలుపుమని ధిక్కరించి పలుకు నా గంధర్వకుమారు నీక్షించి యా వామాక్షి నివ్వఱంబడుచు వారు దివ్య ప్రభావ సంపన్నులని నిశ్చయించి వా రిరువురకు నమస్కరించుచు నల్లన నిట్లనియె. మహాత్ములారా ! మీరెవ్వరో నే నెఱుంగను. స్త్రీలు నివసించు నంతఃపురంబుల కిట్లు నిశ్శంకగ నేతెంచుట ధర్మంబగునా ? అని ప్రశ్నించిన జలాధిదేవతకు ప్రమధుం డిట్లనియె.

నేను పినాకపాణి కింకరుండను. ఈతండు గంధర్వకుమారుండు ఆ దేవో త్తముని యానతి నేనిందు వీనితో వచ్చితిని. కర్దమ మునిపుత్రుని నీ వపహరించితివి. వానిని సంరక్షించి తండ్రి కప్పగించుటకు నాకీశ్వరుం డాజ్ఞాపించెను. శివపూజాధురం