పుట:కాశీమజిలీకథలు-12.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జలాధిదేవత కథ

285

ఆమెనేఁడు నవయౌవనంబునఁజెన్ను మీరియున్నది. దానికి తగినవరుని సమకూర్చుటకు మాయేలిక తొందరపడుచున్నాఁడు.

నేను - అట్టివాడెందై న లభించెనా?

నూతనవ్యక్తి - ఈమధ్య నొకమునికుమారుని రూపయౌవన విరాజితుని మాయేలికసాని యెట్లొ సమకూర్చి భర్తసన్నిధికిఁ బంపినది. యా పడుచును వానికిచ్చి యుద్వాహంబు సేయుటకు తలంచుచున్నారు. ఆసందర్భమున నే నిందువచ్చితిని. ముందెట్లుఁజరుగునో యెవ్వరు చెప్పగలరు. నేనిందు మసలరాదు. అనిచెప్పి యాకింక రుఁడు సౌధద్వారసన్నిధికేగి యెద్దియో కీలుత్రిప్పెను. తోడనేయాద్వారంబు తెఱచు కొన నతండు లోనికేగెను. వివృతమైయున్న యాద్వారము వెంబడి నేనును దెంపున లోనికేగి వానివెంట జలాధిదేవత సన్నిధికరిగితిని. నన్నుఁజూచినతోడనే యా సుందరి సందియంబడుచు కింకరుని మొగంబై ఓరీ ! ఈ పురుషుండెవ్వఁడు ? వీని నెందుల కిచ్చటికిఁ దోడ్కొని వచ్చితివని యడిగెను. దానికి కింకరుం డిట్లనియె.

అమ్మా ! ఈతండెవ్వడో నేనెఱుంగ. మన సౌధద్వార సమీపంబున నుండగాఁ జూచితిని. నేనిందేఁతెంచుచుండ నావెంట నితఁడుగూడ వచ్చెను. తానొక గంధర్వకుమారుఁడనని నాతో నితండు జెప్పెను. ఇంతకన్న నాకేమియుం దెలియ దని చెప్పెను. ఆ మాటలకు జలాధిదేవత సంశయదృష్టులు నాపైఁబఱపుచు నీ యుదంతం బామూలచూడముగా నెఱింగించి యిందులకేమిటికి వచ్చితివో బలుకుమని యడిగినది నేనామెతో జరిగిన కథయంతయు సవిస్తరముఁజెప్పి యా మునికుమారు నొప్పగింపుమని ప్రార్దించితిని. దానికమ్మగువ నన్నిధిక్షేపించుచు నోహో ! మ్రుచ్చు వలె నిందువచ్చుటయేగాకుండ లేనిపోనినిందల మోప సాహసించుచుంటివా ! మీ మునికుమారు నీకిచ్చుట కిందెచ్చట నున్నాఁడు. పోపొమ్మని గద్దించి పలికినది. అందు లకు నేనించుక కనలి యామెతో “నేమేమీ ! మునికుమారుని నీవెఱుంగునే యెఱుం గవా ? యీశ్వరదూత సామర్ద్యంబొకింత దలచికొనుము. అతండు నిక్కమ యలిగె నేని నీ యధికారమంతయును భస్మంబొనరింపఁగలఁడు చేసిన తప్పునకు క్షమాపణ జెప్పికొనుచు సత్వరమ వాని నాబాలకు నప్పగించుట శ్రేయస్కరమని నొక్కి జెప్పి తిని.

నా మాటలకాబోటి యలుగుచు ఓరీ ! సేవకా ! చూచెదవేమిటికి ? పడుచుఁ దనంపుగర్వంబున నెదిరి సామర్థ్యం బెఱుంగక నోటికివచ్చినట్లెల్ల ప్రేలుచున్న వీనిం బట్టి కాసారతీరంబునఁ బడవేసిరమ్ము. అని యాజ్ఞాపించినతోడనే యమునివంటి యా కింకరుఁడు నన్నొడసిఁబట్టి యొక్కవ్రేటున నీ తీరంబునకు విసరివైచెను. ఆ పాటున మూర్చవచ్చి యిప్పటికి దెలివొందితిని. ఈశ్వరానుగ్రహంబున‌ నా మాయలాడి చేతంజిక్కిన మీసన్నిధానమునకు వచ్చి చేరగలిగితిని. కర్దమ మునిపుత్రుఁడు సరిత్పతీ