పుట:కాశీమజిలీకథలు-12.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

ధాత్వంబు గలుగనేరదు. విధివిధానమిట్లుండ నెవరేమి చేయుటకును కర్తలుకారు. నా పలుకులు తెరంగున నీకు కచ్చపజన్మంబు తప్పనిదైనను కొలఁదిదినములలోనే నీవున్న సరోవరంబున నీశ్వరదూత పాదఘాతంబువలన శాపాంతమయ్యెడు. విచారింపక పొమ్మని బలకి యామునీంద్రుఁడు యధేశ్చవిహారంబున నెందేనిబోయెను. హత భాగ్యుండనగు నేను దోడివారి' యనునయంబున నించుక ధైర్యంబవలంభించి విచా రంబు మొగంబునఁదోప నెట్టకేలకు మన్నిలయంబునకేగి నా భంగపాటు నాతల్లి దండ్రుల కెఱింగించితిని. వారు నాకై మిగుల విచారించిరి. శాపాంతమున కనేక సాధనము లాలోచింపసాగిరి. శివపూజాదురంధరుండగు కర్దమ మునితల్లజుని యాశ్రమ పరిసరంబు నందలి కాసారంబుననున్న శ్రేయస్కరమని తలంచి యందు కచ్చప జన్మంబున ననుభవించుటకు శాపాంతమున ప్రమధోత్తముని నందు దెచ్చుటకు తగు నుపాయము తామాలోచించెదమనియుఁ జెప్పి నన్ను వీడ్కొలిపిరి. నేనును విధి నిబద్దుండనై యా వెంటనే కచ్చపమునై యిందు వర్తించుచుంటిని. నేఁడు కర్దమ కుమారు నన్వేషించు నిమిత్తము మీరిందేతెంచిన కతంబున నా పాపంబు రూపుమాపి యధాస్థితిం బొందితిని. ఇదేయే నా వృత్తాంతము. మునికుమారుం డేమయ్యెనో నే నెఱుంగను. అనుజ్ఞ యిచ్చెదరేని వాని నన్వేషించి తమకోపినంత సహాయము జేయగల వాడననిమృదుమధుర వాగ్గుంభనల నా ప్రమధుని మనంబున కానందంబు గలిగించెను.

351 వ మజిలీ

ప్రమధుని కథ

ఇంతలో నా గంధర్వకుమారుని జననీజనకు లచ్చోటునకువచ్చి నిజస్వరూ పంబు బొడగట్టుచున్న నందునిగాంచి యానందమేదుర హృదయపుండరీకులై చేరువ నున్న యీశ్వరదూత పాదపల్లవంబులకు ప్రణమిల్లుచు పుత్రకుని జేరదీసికొని‌ యిట్ల నిరి. ప్రమధోత్తమా ! మీ కటాక్షంబువలన మా కుమారుని దారుణశాపంబు దీరినది. కృతార్దుల మైతిమి.‌ వీనిందోడ్కొని మా పురంబున కేగుట కనుజ్ఞయొసంగదవే? అని ప్రార్థించిన నాప్రమధుం డిట్లనియె.

ఔరా ! ఎంతమోసము ! కర్దమపుత్రుని నపహరించిన దుష్టజంతువు నెఱిం గించెదనని మీతనయుండు నాతో ప్రతినపట్టియన్నాడు వాని యునికిఁ దెలియజేయు వఱకు వీని నొక్కయడుగైన గదలనీయనని యాశివకింకరుఁడు సుబాహుని చేయి పట్టు కొనెను. సుబాహుని జనకుండు ప్రమధుని గైమోడ్పు లొసంగుచు పుణ్యమూర్తీ ! కర్దమ పుత్రుని యాగడ నాతనూజుం డెఱుంగడని‌ నేజెప్పగలను. అట్టివాని నిందు నిర్బంధించిన నేమిఛాఏయగలఁడు. వానివృత్తాంతము నాకించుక దెలియును. శాంతించిన నదియెల్లఁ దెల్లముగా మీకు వివరించుకొందును. మాకుమారుని నిర్దోషిని క్షమించి విడిచి పెట్టఁగల౦దులకు ప్రార్ధించుచున్నానని వినయముదోప పల్కు నాగంధర్వపతి కా