పుట:కాశీమజిలీకథలు-12.pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రమధుని కథ

281

పశుపతి దూతయాత్రంబున నా వృత్తాంతంబెల్ల సవిస్తరముగా జెప్పుమనుటయు నతం డతని కిట్లనియె.

ఆర్యా ! నా తనయునికి గచ్చపజన్మం బొదవిననాటఁగోలె వాని శాపాంతము నకై వెరవాలోచించి యొకనాఁడు. వారణాసికిం జని యందు విశ్వనాధునిగూర్చి పెద్దయుంబ్రొద్దు భక్తితత్పరుండనై తపంబొనరించితిని. భక్తసులభుండగు నమ్మహా దేవుండు నాకు ప్రసన్నుఁడై వరముకోరుమనిన నేనాదేవోత్తమునికి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి దేవదేవా ! నారదునివలన శపింపబడిన నాతనయునకు శీఘ్రమ శాపాంతమగునట్లు వరంబొసంగమని ప్రార్దించిన నాపినాకపాణి నాకిట్లనియెను. గందర్వచూడామణీ ! ప్రమధుని పాతఘాతంబునం గదా ! వానికి శాపాంతమగునట్లు నారదమహర్షి నిరూపించెను దానికి నేనొక్కయుపాయం బెఱింగించెద నట్లొనర్పమని నాకు దానిని యాదేవుం డంతర్హి తుండయ్యెను.

విశ్వేశ్వరా దేశంబున నేను కామరూపంబున మహాసక్రమంబైన యాసరోవరం బున కర్దమపుత్రుని రాకకై నిరీక్షించియుంటిని అబ్బాలకుండెట్టకేలకు కాసారమున కేతించి మిత్రులతో జలవిహారంబొనరించు నప్పుడు తఱియెఱింగి వాని పాదంబు గబ ళించి క్రచ్చఱ జలాధి‌దేవత సన్నిధికిం దోడ్కొనిపోయి యప్పగించి వచ్చితిని అఖండ తపోదీక్షయందుండి తనయుని పాదెఱిగించినను దెలిసికొననేరని కర్దముని మహాను భావత్వంబున కలరి యమ్మహాదేవుండు వానితనూజుని సంరక్షింప మిమ్మునియోగించెను. ధానఁబుత్రుని శాపము బాపుకొనగలిగితిని. నాయభీప్సితం బీడేరెను కర్దమ తనూజుని బట్టి జలాధిదేవత సన్నిధినిజేర్చి వచ్చువఱఁ కే నేను మొసలిరూపంబు నుండుటకీశ్వరుని యాదేశముకావున పిమ్మట నాబాలకుండేమయ్యెనో నేనెఱుంగసు. వాని క్షేమంబెఱింగి దోడ్కొనివచ్చుటకు దేవరయేకర్తలు. పరమేశ్వరుని యనుమతంబున నేనొర్చినపనికిఁ గినియక క్షమించి మాకు సెలవొసంగుఁడని ప్రార్దించిన నలరి గిరీశుని కింకరుఁడు గంధర్వునితో వానితనూజుం డేగుటకు సమ్మతించెను.

అంత సుబాహుండు తండ్రితోఁబోవుట కసుమతింపక ప్రాణదాతయగు నీ ప్రమధసత్తముని పూన్కె నెఱవేఱు పర్యంతము నేను మీవెంట రాఁజాలను, నా నిమి త్తమై కర్దమపుత్రుని నాపదలం ద్రోయుటయే కాకుండ నీప్రమధోత్తమునింగూడ దద న్వేషణంబున శ్రమపెట్టదలంచుట పాడిగాదు. మునిపుత్రుని యుదంతంబెఱింగించి చేయఁదగిన సహాయముఁ జేయుదనని నేను మొదటనే యిమ్మహానుభావునితోఁ బలికితిని. ఆడినమాట దప్పుటకన్న మిస్నయగు దోషంబు‌న్నదా ! మీవలన యా మునికుమారుని యుదంతంబించుకఁదెలియ వచ్చెనుగదా ! ఆ జలాధిదేవతనే ప్రార్దించి యక్కుమారుని దెచ్చి వీని కప్పగించువఱకు నేసు రాఁజాలనని పలుకు తనయున కేమియుంబదులుఁజెప్ప గలను. యా గంధర్వపతి తనలోకంబున కేగెను.