పుట:కాశీమజిలీకథలు-12.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

మహానందుని కథ

279


    శ్రద్ధతోవినుచుండు శైవపురాణముల్
               ముక్తిమంటపశీమ, మునులుజదువ
    ప్రీతి నీరాజనక్రియలభక్తులువాకి
               ళులజల్లు దివ్యాన్న ముల భుజించు.

గీ. ప్రణవమంత్రంబు గేంకారవముతోడఁ
   గూర్చి బలుమారుబల్కును గోర్క్‌మీఱ
   పూర్వసంస్మృతినిగల్గి పుణ్యగరిమఁ
   గుక్కుటంబులునాల్గుఁ బేరెక్కిమిగుల.

అట్లాముక్తి మంటపంబునాశ్రయించియుండి యాకుక్కుటములు గొంత కాలమున కనన్యదుర్లభంబగు శివసాయుజ్యంబు బొందెను. ప్రమధముఖ్యా ! నారుదుండీ కథనెల్లఁ దెల్లముగ మాకుజెప్పి వెండియు నిట్లనియెను. వింటిరా ! వారణాసీ విశే షము ఎట్టిపాపకర్ముఁడైనను తత్పురనివాస మాత్రముననే పరమపవిత్రుఁడై మోక్ష లక్ష్మిని జేరగలుగును. అట్టి కాశీప్రభావంబు వర్ణింప నిలింపగురునికైన నలవిగాదు. అనిపలుకుచున్న యా దేముని పలుకులకలరి యా గంధర్వకుమారులు వారణాసిని మిగుల కొనియాడిరి. నేనుమాత్ర మందుల కంగీకరింప ప్రతివాదముసేయ నారం భించి మహానందునకు మోక్షమబ్బుట కాశీనివాస శేషంబువలన గాదనియు నంతంబున విశ్వేశ్వరుని ధ్యానించిన విశేషంబుగలిగెనని వాసరమునీంద్రునితో పెద్దగా వాదించితిని. అందులకాదేవమౌని మిగుల విసుగుజెందుచు ఓరీ ! నీవందరికన్న నెక్కుడు తెలిసిన వానివలె మితిమీరి నాతో వాదించుచుంటవి. మామాటకెదురాడ సర్వసుపర్వసందోహ మును భయఁపడుదురుగాని నీకిసుమంతయుసంశయము లేకపోయెను. కాశియందు పెద్ద కాలము నివసించి యుండుట కతంబున తత్ప్రభావంబుననే యామహానందుఁ డెంతపతి తుండైనను నంతంబున విశ్వనాధుఁదలంచు భాగ్యంబబ్బెను. లేకున్న వేఱొకనికిట్టి బుద్దిపుట్టునా ! దీనికంతకును నిమ్మహాక్షేత్రప్రభావంబని యిప్పటికైనఁదెలిసికొనుము. కూపస్థకూర్మంబువలె ధర్మమార్గంబుల నెఱుంగక నోటికివచ్చినట్లెల్ల వదరుచుంటివి. కాశీక్షేత్రంబును నిందించిన మహాపాతకంబుననింకమీద నీవు భూలోకంబున కచ్చప జన్మంబునందగలవని కఠినముగా నన్ను శపించెను.

ఆ మాటవిని నా హృదయంబు వేయిశకలములైనది. ఎక్కడలేని పశ్చా త్తాపము నన్నావేసించినది. పూజ్యుఁడను నమ్ముని ప్రవరునితో వాగ్వాదమొనరించిన తప్పునాకు వెంటనే గోచరమైనది. ఏమిచేయుటకు నేమనుటకు మనంబున దెలియక

లమ. యతని యడుగుదమ్ముల వ్రాలితిని. కొంతసేపటికా మునితల్లఁజుడు శాంతించి యడుగులఁబడియున్న నన్ను లేవనెత్తుచు కుమారా ! లెమ్ము కాశీక్షేత్రప్రభా వంబున ---------- నీపై నాకెన్నఁడునులేని యలుకఁగలిగినది. నామాట కన్య