పుట:కాశీమజిలీకథలు-12.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము


    జూచి యతండొక రాతిరి
    దాచినవిత్తంబుఁ గొంత తరలించి వెసన్‌.

క. పురివెడలి చనియెదురుగ మ
   సరణిన్నడిరేయినట్లుఁ జనఁగొందరు త
   స్కరు లెదురుపడిరి‌ యమకిం
   కర సదృశాకృతుల వెలయఁగా వారలకున్‌.

అట్లెదురైన తస్కరులనందరఁ గనుంగొని బ్రాహ్మణుండు అయ్యో ! పెక్కు బాధలను గడించిన విత్తమెల్ల వీరిపాల్వడును కాబోలు ! నన్నురక్షింప దిక్కెవ్వరని యోచించుచుండ నా తస్కరులు వారియొద్దగల ధనమంతయును దోచు కొనుటయేగాకుండ గుఠారముల ఝళిపించుచు నలువురం దెగటార్ప నుంకించు సమ యంబున ఆ తస్కరులచే తనకు మృత్యువు తప్పదని గ్రహించి తానుజేసిన దుష్కర క్రియలకు పశ్చాతప్తుండై చిత్తంబు గాశీవిశ్వనాధునియందు నిల్చి భక్తితాత్పర్యంబుల హా ! విశ్వేశ్వర ! గంగాధర ! శంకర ! బాలమృంకవర్ణ ! ఫాలనేత్ర ! మురహర ! గండికేళ ! భూతేశ ! భూతపతి ! మృత్యుంజయ ! మహాదేవ ! శంభూ ! నీలకంఠ ! దేవదేవ నమస్తేనమః


చ. అని తలపోయుచున్నతరి నగ్గడిదొంగలుచేరి వారినిం
    గనికరమింకలేక వెసగాలుని వీటికి మేటివిందుగా
    ననిపి తదీయవిత్తము సమస్తముగైకొని సంతసంబుతోఁ
    జనిరి ధరిత్రి లోభిజనసంపద కున్వ్యమిట్టు లేకదా.

మహారణ్యమధ్య మందట్లు మృత్యుండైన మహనందుడు పాపపంకిలుడై యున్నను గాశీనివాస విశేషంబునంజేసియును సంతంబున విశ్వేశ్వరుని దలంచుటం జేసియు ముందుజన్మంబున సవ్వారణాసియందు కుక్కుటముగాబుట్టి పూర్వజ్ఞానంబున గల్గియుండెను. ప్రియంవదయుఁ బుత్రులుగూడ దోషదూషితులైనను కాశీక్షేత్ర నివాస జన్యపుణ్యంబునంజేసి పూర్వస్మృతులం బడసి యయ్యవిముక్తసీయందే కుక్కుటములై యవ్వలి జన్మంబున బుట్టిరి. ఆకుక్కుటిచతుష్కము పూర్వస్మృతిగల్గి యుండుటచే శ్రీకాశీవిశ్వనాధు నాలయంబుఁజేరి యా పరమేశ్వరునియందే దృష్టులిడి గాలంబు గడుపుచుండిరి.


సీ. అతిభక్తివిశ్వేశు నాలయంబును
              జుట్టితిరిగి ప్రదక్షిణాల్జరుపు నెపుడు
    నిష్టతోమందాకినీ నీరముల
              వేగువేళకు మజ్జనవిధులదీర్చు